epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బెదిరింపుల ముఠా గుట్టు రట్టు!

బెదిరింపుల ముఠా గుట్టు రట్టు!
జనశక్తి పేరుతో వసూళ్ల దందా
9 ఎంఎం పిస్టల్‌తో నలుగురు అరెస్ట్
భూ వివాదాల్లో జోక్యం, డబ్బుల డిమాండ్
పోలీసుల అప్రమత్తతతో బట్టబయలు

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : జనశక్తి కార్యకలాపాల పేరుతో ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయాలని యత్నించిన ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఒక 9 ఎంఎం పిస్టల్‌తో పాటు ఐదు రౌండ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తోకల శ్రీకాంత్, దాసరి తిరుపతి, పయ్యావుల గోవర్ధన్‌తో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన వంజరి సురేందర్ ముఠాగా ఏర్పడి జనశక్తి పేరుతో ప్రజలను బెదిరించడం, భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, డబ్బులు వసూలు చేయడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది. ఈ సమాచారం మేరకు తంగళ్లపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అడ్డుకుని తనిఖీ చేశారు. తనిఖీల్లో వారి వద్ద ఒక 9 ఎంఎం పిస్టల్‌తో పాటు ఐదు రౌండ్లు లభించడంతో ఆయుధాలను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.

గతంలోనూ సంబంధాలు

అరెస్ట్ అయిన వారిలో తోకల శ్రీకాంత్ (34), దాసరి తిరుపతి (43), వంజరి సురేందర్ అలియాస్ విశ్వనాథ్ అలియాస్ బాదం సూర్య ప్రకాష్ రెడ్డి (57), పయ్యావుల గోవర్ధన్ (31) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో కొందరికి గతంలో నిషేధిత జనశక్తి సంస్థతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలను బెదిరించడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌లో సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, టాస్క్‌ఫోర్స్ సీఐ నటేష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రవి, ఎస్సై ఉపేంద్రచారి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.