epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం!

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం!
నిబంధనల ప్రకారమే ఇసుక కేటాయింపు
కొత్తపల్లి ఇసుక క్వారీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పోలీస్ కమిషనర్‌తో కలిసి పరిశీలన
అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలంటూ హెచ్చ‌రిక‌లు

కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీ నిర్వహించాల్సి ఉంటుందని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి పరిధిలోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌లో కొనసాగుతున్న ఇసుక క్వారీని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం‌తో కలిసి బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. దిగువ మానేరు జలాశయంలో పేరుకుపోయిన 0.3 టీఎంసీల పూడిక తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఈమోట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. పూడిక నుంచి ఇసుకను వేరు చేసి టీజీఎండిసి పర్యవేక్షణలో వాణిజ్య అవసరాలకు విక్రయిస్తున్న విధానాన్ని సీపీతో కలిసి సమీక్షించారు.

లోడింగ్, వేయింగ్‌పై కఠిన నిఘా

క్వారీ వద్ద ఇసుక లోడింగ్, వేయింగ్ ప్రక్రియలను పర్యవేక్షించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్ రికార్డులు, వేబిల్లులను పరిశీలించారు. నిర్ణీత పరిమితికి మించి ఇసుక తరలించినా, కేటాయించిన వాహనాలకే కాకుండా ఇతర వాహనాలు క్వారీలోకి ప్రవేశించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలు, లోడింగ్ పరిమితి, వేబిల్లులు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక లోడింగ్ చేయరాదని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ లోడింగ్, వేయింగ్ సమయంలో ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. క్వారీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టీజీఎండిసి ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డీఈఈ శ్రీనివాస్, ఏఈఈ సంజన, ఏఈ వంశీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.