epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు థియరీ పరీక్షలు
జిల్లాలో 66 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఖ‌మ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో జనరల్, వొకేషనల్ కలిపి మొత్తం 35,188 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు.
జిల్లాలో 66 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే 67 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో జరుగుతాయని వివరించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆంగ్లం ప్రాక్టికల్ పరీక్ష జనవరి 21న, రెండవ సంవత్సరం విద్యార్థులకు జనవరి 22న నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 23న ఎథిక్స్, మానవ విలువలు, జనవరి 24న పర్యావరణ అవగాహనపై ఇంటర్నల్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు.

మౌలిక సదుపాయాలు తప్పనిసరి

వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీటి సదుపాయం కల్పించాలని, అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు పరీక్షా కేంద్రాల రూట్లలో స్పెషల్ బస్సులు నడపాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో పనిచేసే ఇన్విజిలేటర్లకు అవసరమైన శిక్షణ అందించాలని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ జరగకుండా చీఫ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల సమక్షంలోనే ప్రశ్నాపత్రాల సీల్స్ ఓపెన్ చేయాలని, ఆ సమయంలో సెల్‌ఫోన్లు తీసుకురాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్ఓ పద్మశ్రీ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కె. రవిబాబు, ఆర్టీసీ, విద్యుత్, పంచాయతీ, మునిసిపల్, పోస్టల్, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.