epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్

అవినీతి కవలలుగా బీజేపీ–బీఆర్ఎస్
కరీంనగర్‌ను అవినీతి అడ్డాగా మార్చారు
రహస్య పొత్తుతో ప్రజలను మోసం చేశారు
మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి
కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరాన్ని గత పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి అడ్డాగా మార్చి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాయని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర విమర్శలు చేశారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు ప్రకటించడంతో ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో 90 శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు 70 శాతానికి పైగా గెలిచారని గుర్తు చేశారు.

బీజేపీ–బీఆర్ఎస్ రహస్య పొత్తు

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ రహస్య పొత్తు ఉందని ఆరోపించారు. గత ఎన్నికల్లో 30 శాతానికి మించని ఈ రెండు పార్టీలు రాబోయే ఎన్నికల్లో 10 శాతానికే పరిమితం అవుతాయని వ్యాఖ్యానించారు. పార్టీల మార్పులతో అవినీతి రూపం మారుతుందే తప్ప తీరులో మార్పు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ, కేబుల్ బ్రిడ్జి పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఎన్నికల అనంతరం పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. డంపింగ్ యార్డు సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధి కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు వెలిచాల రాజేందర్ రావు, వైద్యుల అంజన్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.