epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్ర‌యాణ ప్రాంగ‌ణాన్ని ప‌ట్టించుకోరా..?!

ప్ర‌యాణ ప్రాంగ‌ణాన్ని ప‌ట్టించుకోరా..?!
అధ్వానంగా కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్
నూతన బస్టాండ్ హామీలు కాగితాలకే పరిమితం
అభివృద్ధికి నిధులు లేవంటున్న అధికారులు
వర్షాకాలంలో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా పేరున్న కొత్తగూడెంలో తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. ఒకవైపు సిరులు ఉన్న సింగరేణి ప్రాంతం అయినప్పటికీ, అదే ప్రాంతంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ మాత్రం మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సరైన వసతులు లేక తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అధికారులను ప్రశ్నిస్తే… ఆదాయం తక్కువగా ఉండటంతో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని సమాధానం చెబుతున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమా, లేక ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమా అన్నది అర్థంకాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో బస్టాండ్‌లోని సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు పైకప్పు నుంచి కారే నీటితో ఇబ్బందులు పడుతున్నారు.

కలగానే మిగిలిన మౌలిక సదుపాయాలు

కొత్తగూడెం బస్టాండ్ ఆవరణలో బస్సుల కంటే ప్రైవేటు వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మహిళా ప్రయాణికులకు మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతూ వినియోగానికి అనర్హంగా మారాయి. పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకు సుమారు 60 సర్వీసులు నడుస్తున్నప్పటికీ, నెలకు దాదాపు రూ.15 లక్షల ఆదాయం మాత్రమే వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ ఆదాయంతో అభివృద్ధి సాధ్యపడటం లేదని వారు వాదిస్తున్నారు.

నేతల హామీలు బుట్టదాకలే

నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించినప్పటికీ, జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ అభివృద్ధిపై నేతలు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేరలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి నిధులతో బస్టాండ్ ఆధునీకరణకు సుమారు రూ.10 కోట్ల మేర తీసుకువస్తానని ఎమ్మెల్యే పూనమనేని సాంబశివరావు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగినా, ఆ దిశగా పురోగతి లేదని తెలుస్తోంది. సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో బస్టాండ్ అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారిందని స్థానికులు అంటున్నారు. శిధిలావస్థకు చేరిన బస్టాండ్‌కు తాత్కాలిక మరమ్మత్తులు చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

అభివృద్ధికి నిధులేవి..?

జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్ల సుందరీకరణకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా విడుదల కాలేదని అధికారులు స్వయంగా చెబుతున్నారు. సింగరేణి, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బస్టాండ్ ఆవరణలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అభివృద్ధికి వినియోగించడంలో ఎందుకు వెనుకాడుతున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు వాహనాల అక్రమ పార్కింగ్‌తో ఆర్టీసీ బస్సులు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, చర్యలు తీసుకునే నాధుడే కనపడటం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం బస్టాండ్‌కు నూతన రూపం ఎప్పుడు వస్తుందోనన్న ప్రశ్న ఇప్పటికీ అనుత్తరంగానే మిగిలింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.