epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌కు రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి

కాంగ్రెస్‌కు రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి..
పార్టీని, ప్ర‌భుత్వాన్ని జ‌నం మ‌డ‌త పెట్టేస్తారు
తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే గెలుపు మాదే
బై ఎల‌క్ష‌న్లు వ‌స్తున్నాయి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో భ‌యం
ఫిరాయింపు ఎమ్మెల్యేలు ద‌మ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలి
శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని, జ‌నంలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ప్ర‌భుత్వం చాత‌గానిద‌ని, ముందు చూపులేనిద‌ని జ‌నాల‌కు అర్థ‌మైంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్ర‌జ‌లు మ‌డ‌త పెట్ట‌డం ఖాయ‌మ‌ని అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ ప‌రిధిలోని మియాపూర్‌లో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్‌పై, తనపై కేసులు తప్పా 20నెలల్లో రేవంత్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సొంత ఆస్తులు, భూములు పెంచుకోవటానికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి పోయారని విమర్శించారు.

ద‌మ్ముంటే కాంగ్రెస్ గుర్తు పోటీచేయాలే..!
రాష్ట్రంలో త్వ‌ర‌లోనే బై ఎల‌క్ష‌న్లు రాబోతున్నాయ‌ని కేటీఆర్ అన్నారు. బై ఎల‌క్ష‌న్లు రావ‌డం ఖాయ‌మ‌ని తేలిపోగా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో వ‌ణుకు పుడుతోంద‌న్నారు. అంత నిజాయితీగా ఉంటే ఎందుకు భ‌యం అంటూ ప్ర‌శ్నించారు. ద‌మ్ముంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆ పార్టీ గుర్తుపైనే పోటీ చేసి గెల‌వాలంటూ కేటీఆర్ స‌వాల్ విసిరారు. ఎవరూ గెలుస్తారో చూసుకుందామని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, కేసీఆర్ గెలుస్తారో ప్రజలే తేలుస్తారని పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్లినా.. కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ వైపే నిలబడ్డారని చెప్పుకొచ్చారు.

హైడ్రా పేరుతో అరాచకం
ఎంతో ముందు చూపుతో ప‌దేళ్ల‌లో కేసీఆర్ హైద‌రాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశార‌ని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకు గుండెకాయగా కేసీఆర్ చేశారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సన్నాసి పనుల వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. హైడ్రా పేరుతో అరాచ‌కాలు చేయ‌డం మొద‌లు పెట్టింద‌న్నారు. ఎంతోమంది పేద‌ల‌ను ఇళ్ల‌ను కూల్చి..రోడ్డు పాలు చేసింద‌న్నారు. పేద‌ల ఇళ్ల‌ను కూల్చిన ఈ రేవంత్ రెడ్డి స‌ర్కారుకు దుర్గం చెరువులోని సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు కూల్చే దమ్ము ఉందా? అంటూ హైడ్రాకు కేటీఆర్ సవాల్ విసిరారు. అంటే పేదోల‌పైనేనా..మీ ప్ర‌తాపం.. సామాన్యుడిని రోడ్డు పాలు చేసి..పెద్ద‌ల అక్ర‌మాల‌కు వ‌త్తాసు ప‌లుకుతోంది హైడ్రా అంటూ మండిప‌డ్డారు. హైడ్రా.. కాంగ్రెస్ నాయకుల దందాలకే పనికొస్తోందని ఆరోపించారు. బిల్డర్లు, కాంట్రాక్టర్ల దగ్గర ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారని గుర్తుచేశారు.

బీఆర్ఎస్‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ కంచుకోట‌

గ్రేటర్ హైదరాబాద్ నగరం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అంటూ ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. ఈ విషయం అనేక ఎన్నికల్లో రుజువైందని పేర్కొన్నారు. సొంత ఆస్తులు, భూములు పెంచుకోవటానికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని ఆరోపించారు.కొంత‌మంది నాయ‌కులు పార్టీని స్వార్థ‌ప్ర‌యోజ‌నాల కోసం వీడినా..నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మాత్రం గులాబీ పార్టీకి దండుగా నిలిచార‌న్నారు. పార్టీకోసం ప‌నిచేసిన వారంద‌రికి అవ‌కాశాలు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ కార్య‌క‌ర్త‌ల‌కు నేత‌ల‌కు హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది బిజినెస్‌మెన్ కావాల‌నేది నా చిన్న‌ప్ప‌టి క‌ల‌ అన్న...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

పది పార్టీలు మారిన చరిత్ర నీది

పది పార్టీలు మారిన చరిత్ర నీది నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది? సీఎం రేవంత్‌ను తిడుతుంటే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.