epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌కు ఓటమి భ‌యం

కాంగ్రెస్‌కు ఓటమి భ‌యం..!
అందుకే స్థానిక సంస్థ‌ల‌ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో జాప్యం
వ్య‌వ‌స్థ‌ల‌న్నీ సమగ్రంగా పనిచేస్తేనే గ్రామ స్వ‌రాజ్యం
బీఆర్ఎస్ ప్రభుత్వ పాల‌న ఓ చీకటి అధ్యాయం
ప్ర‌శ్నించే వారికి సోష‌ల్ మీడియా ఓ మంచి వేదిక‌… ఆయుధం
ఆ ఆయుధాన్ని సొంత పార్టీలోనే విభ‌జ‌న‌క వాడొద్దు
మ‌ల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌లంటేనే భ‌యం పట్టుకుంటోంద‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ, బీజీపీ రాష్ట్ర నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ ఎద్దేవా చేశారు. ఆ భ‌యంతోనే రెండేళ్లు కావ‌స్తున్నా.. స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేదని అన్నారు. మునిసిపాలిటీ, జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిషత్‌ల‌కు పాల‌క వ‌ర్గాలు లేక ప‌రిపాల‌న ఆగ‌మాగంగా ఉంద‌ని అన్నారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స‌మ‌గ్రంగా..స‌మ‌ర్థవంతంగా ప‌నిచేస్తేనే గ్రామ స్వ‌రాజ్యం సిద్ధిస్తుంద‌ని అన్నారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ సోషల్ మీడియా మరియు ఐటీ మరియు సోషల్ మీడియా వర్క్ షాప్‌లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంద‌న్నారు. రాష్ట్రంలో మొన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని చీకటి అధ్యాయ‌మ‌ని, ఇప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌జ‌లు బీఆర్ ఎస్ చీక‌టి పాల‌న‌ను మ‌రిచిపోవ‌డం లేద‌న్నారు.

కేంద్రం నిధుల‌తోనే గ్రామాభివృద్ధి..!

“సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది” అన్నట్లు, కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ తమవిగా చెప్పుకుంటున్నాయ‌ని ఈట‌ల అన్నారు. గ్రామాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణమయ్యాయ‌ని తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంద‌న్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయ‌న్నారు. అందుకే అభివృద్ధి కొనసాగాలంటే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనీ మీరందరూ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుతున్నాని తెలిపారు.

సోషల్ మీడియా పాత్ర చాలా ముఖ్యమైంది..
నిజాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు సోష‌ల్ మీడియా ఒక గొప్ప ఫ్లాట్‌ఫాం అని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది కూడా సోషల్ మీడియానేనని అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి.. వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి.. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే యోధుల‌ని అన్నారు. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిది.. అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప, మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదంటూ హిత‌వు ప‌లికారు. సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబైల్ ఫోన్, వారి మెదడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తేనే ఫలితం స‌మ‌ర్థ‌వంతంగా ఉంటుంద‌న్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది

ఆ అవ‌మాన‌మే న‌న్ను ఎమ్మెల్యేను చేసింది బిజినెస్‌మెన్ కావాల‌నేది నా చిన్న‌ప్ప‌టి క‌ల‌ అన్న...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

పది పార్టీలు మారిన చరిత్ర నీది

పది పార్టీలు మారిన చరిత్ర నీది నువ్వా కాంగ్రెస్‌ను విమర్శించేది? సీఎం రేవంత్‌ను తిడుతుంటే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.