epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అధికారం లేనివారితో అభివృద్ధి సాధ్యమా?

అధికారం లేనివారితో అభివృద్ధి సాధ్యమా?
స్వతంత్రుల ముసుగులో వస్తే మోసపోవద్దు
‘శీనన్న మనిషిని’ అంటే నమ్మకండి
అభివృద్ధి చేసే శక్తి కాంగ్రెస్‌కే ఉంది
ప్రత్యర్థులకు అధికారం లేదు – పనీ లేదు
కొత్త‌గూడె కార్పోరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మంత్రి పొంగులేటి

కాకతీయ, కొత్తగూడెం : అధికారం లేని ప్రత్యర్థులతో అభివృద్ధి అసాధ్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల వేళ స్వతంత్రుల ముసుగులో వచ్చే కొత్త అవతారాలను ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు. “నాకు శీనన్న తెలుసు… ఆయనకు నేను సన్నిహితుడిని” అంటూ ఓట్లు అడగడానికి వచ్చే వారు వాస్తవానికి ఎవరికీ దగ్గర కాదని తేల్చిచెప్పారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పలు డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజకీయ లబ్ధి కోసం తమను సొంత మనుషులుగా చెప్పుకునే వారి పట్ల కార్యకర్తలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని, అధికారమూ తమదేనని, అభివృద్ధి చేయగల శక్తి కూడా తమ పార్టీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త ముసుగులతో వచ్చే వ్యక్తుల మాటలను నమ్మొద్దని పిలుపునిచ్చారు.

అధికారం లేని వారికి ఓటెందుకు?
ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఎండగడుతూ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వం మనది… అధికారం మనది… అభివృద్ధి చేసే సత్తా కూడా మనకే ఉంది. అలాంటప్పుడు అధికారం లేని వారికి ప్రజలు ఎందుకు ఓటేయాలి?” అని ప్రశ్నించారు. ప్రత్యర్థులు గెలిచినా ప్రజలకు ఏం చేయగలరని నిలదీశారు. అభివృద్ధి పనులు చేయాలన్నా, ప్రభుత్వ నిధులు తీసుకురావాలన్నా అది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమని స్పష్టం చేశారు. అధికారం లేకుండా హామీలు ఇచ్చేవారు ప్రజలను మోసం చేయడం తప్ప మరేమీ చేయలేరన్నారు. కొత్తగూడెం అభివృద్ధి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమవుతుందని, ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించాలని కోరారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని మంత్రి వివరించారు.

ఇండ్లు ఇచ్చేది నేనే – పట్టాలు ఇచ్చేది నేనే
తన వద్దే గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలు ఉన్నాయని గుర్తు చేస్తూ మంత్రి పొంగులేటి కీలక హామీలు ఇచ్చారు. ఇండ్లు మంజూరు చేయడం, ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం వంటి అధికారాలు తన చేతిలోనే ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి మరో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని, ప్రత్యర్థుల మాటలకు తావులేదని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

సైనికుల్లా కదలండి
కాంగ్రెస్–సీపీఎం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఒక్కో కార్యకర్త సీఎం రేవంత్ రెడ్డిలా, పొంగులేటిలా మారి విపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. స్వతంత్రుల ముసుగులో వస్తున్న మోసకారి శక్తులకు ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. కొత్తగూడెంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నాయని, అదే ఈ ఎన్నికల్లో విజయానికి బాట వేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గ్రహించి సరైన నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, సీపీఎం నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.