epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్జీటీ పోస్టుల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

ఎస్జీటీ పోస్టుల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
గ్రామీణ విద్యపై తీవ్ర ప్రభావం
ప్రభుత్వానికి టీఈఏ నేత ఖాద్రీ విజ్ఞప్తి

కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో కీలకమైన ఎస్జీటీ పోస్టులను రద్దు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన విద్యారంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టర్, పీఈటీ పోస్టుల అవసరం పేరుతో ఇప్పటికే మంజూరైన 2325 ఎస్జీటీ పోస్టులను రద్దు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అశాస్త్రీయమని ఆయన విమర్శించారు. కొత్తగా అవసరమైన 2064 పోస్టులను సృష్టించకుండా, ప్రాథమిక విద్యకు వెన్నెముకలాంటి ఎస్జీటీ పోస్టులను తొలగించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర సంక్షోభంలో పడతాయని ఖాద్రీ హెచ్చరించారు. ఇప్పటికే అనేక ప్రాథమిక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉందని, ఇలాంటి తరుణంలో పోస్టులు తగ్గించడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఎస్జీటీ ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మూలస్తంభాలని, గత మూడు దశాబ్దాలుగా వారికి సరైన ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలని కోరారు. హైస్కూళ్లకు అవసరమైన పోస్టులను ప్రత్యేకంగా మంజూరు చేయాలని, ప్రైమరీ స్కూళ్ల పోస్టులను తగ్గించడం సరికాదని స్పష్టం చేశారు. విద్యారంగాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఖాద్రీ విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.