epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం

స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం
◆ నియమావళి ఉల్లంఘనకు తావులేదు
◆ 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
◆ విధివిధానాలపై ప్రత్యేక అవగాహన
◆ ఘర్షణలకు అవకాశం లేకుండా చర్యలు:
పోలీస్ కమిషనర్ సునీల్ దత్

కాకతీయ, ఖమ్మం బ్యూరో: జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఎన్నికల బందోబస్తు విధులకు సిద్ధమవుతున్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులు, విధివిధానాలు, ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నియంత్రణలో పూర్తి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నియమావళిపై ప్రతి పోలీస్ సిబ్బంది సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని, అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని తెలిపారు.

కఠినంగా శాంతిభద్రతల పరిరక్షణ

శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కమిషనర్ స్పష్టం చేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్‌పోస్టులు, రూట్ మొబైల్ పార్టీలు నిర్వహించే విధులపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన విధులపై స్పష్టతతో పనిచేయాలన్నారు.

అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దు

పోలింగ్ అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో మొత్తం 11 వందల మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.
బందోబస్తు విధుల్లో 4 మంది అడిషనల్ డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 975 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు కమిషనర్ వివరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, ఏసీపీలు తిరుపతి రెడ్డి, నర్సయ్యతో పాటు రూరల్ డివిజన్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని, ప్రజలు కూడా సహకరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.