epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజావాణి ఫిర్యాదులపై కలెక్టర్ సీరియస్

ప్రజావాణి ఫిర్యాదులపై కలెక్టర్ సీరియస్
ఆలస్యం చేస్తే చర్యలు తప్పవు
ప్రజల అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
ఇందిరమ్మ ఇళ్లు, భూమి వివాదాలు, రహదారి సమస్యలపై స్పందన
తక్షణమే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు

కాకతీయ, ఖమ్మం : ప్రజావాణిలో అందుతున్న ప్రజల అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిపై వెంటనే స్పందించిన ఆయన సంబంధిత శాఖ అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్లు, భూమి సమస్యలపై స్పందన

వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన కిన్నెర రాణి తనకు ఇందిరమ్మ ఇల్లు మొదటి విడత నిధులు జమ అయినప్పటికీ తదుపరి విడతలు జమ కాలేదని ఫిర్యాదు చేయగా, హౌజింగ్ పీడీని విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఖమ్మం అర్బన్ గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్.కె. రజియా తనకు ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరగా, సంబంధిత అధికారులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనిజర్ల మండలం గుండ్రాతిమడుగు గ్రామానికి చెందిన సయ్యద్ లాల్ బి తన పేరున్న భూమిలో కొంత భాగాన్ని తన కుమార్తెలకు రిజిస్ట్రేషన్ చేయడంలో అసైన్డ్ భూమిగా చూపిస్తున్నారని ఫిర్యాదు చేయగా, తహశీల్దార్‌ను విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

రైతుల భూములకు రహదారి సమస్యపై ఆదేశాలు

రఘునాధపాలెం మండలం మంచుకొండ, కోయచిలక గ్రామాల రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లే దారిని కొందరు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేయగా, సంబంధిత తహశీల్దార్‌ను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజావాణి కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్ష రైనా, జిల్లా అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.