epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొమ్మాల జాతర ఘనంగా జరగాలి

కొమ్మాల జాతర ఘనంగా జరగాలి
రూ.1.45 కోట్లతో ప్రధాన రహదారి నిర్మాణానికి వేగం
బావుల భద్రతకు కాంక్రీట్ గోడలు నిర్మించాలి
ప్రభ బండ్ల రాకపోకలకు శాశ్వత రహదారులపై దృష్టి
రైతులకు కౌలు చెల్లించి పార్కింగ్ వినియోగం చేయాలి
అధికారులకు ఎమ్మెల్యే రేవూరి ఆదేశాలు

కాకతీయ, గీసుగొండ: ప్రతిష్టాత్మక కొమ్మాల జాతరను ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని కొమ్మాల ఆలయ ప్రాంగణంలోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాతర ఏర్పాట్లపై అధికారులను నిలదీస్తూ పురోగతిని సమీక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రూ.1.45 కోట్ల అంచనాతో ప్రధాన రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 410 మీటర్ల సీసీ రోడ్డు పూర్తి కాగా, మరో 400 మీటర్ల బీటీ రోడ్డు పనులను ఈ నెల 25లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

బావుల భద్రతకు ప్రత్యేక చర్యలు

ప్రధాన రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావులు ప్రమాదకరంగా మారే అవకాశమున్నందున వాటి చుట్టూ కాంక్రీట్ గోడలు నిర్మించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైతే రహదారి వ్యయాన్ని తగ్గించినా భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. గత జాతరతో పోలిస్తే ఈసారి ప్రభుత్వం 16 మంది జిపిఓలను నియమించిందని, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. తహసీల్దార్ రియాజుద్దీన్ మాట్లాడుతూ జాతరకు వచ్చే ప్రధాన మార్గాల్లో ప్రమాదకరంగా ఉన్న ఆరు బావులను గుర్తించి హెచ్చరిక బోర్డులు, భారీ గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు

జాతర ప్రాంతమంతా సమగ్ర లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. కొమ్మాల గ్రామం నుంచి చెరువు కట్ట మీదుగా వచ్చే మార్గంలో 23 విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. జాతర సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించి పర్యవేక్షణ చేపడతామని పేర్కొన్నారు. ఎంపీడీఓ కృష్ణవేణి మాట్లాడుతూ జాతరను ఐదు క్లస్టర్లుగా విభజించి పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ జాతరలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగ్ ద్వారా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతిరోజు పరిస్థితిని పర్యవేక్షిస్తామని చెప్పారు.

అధికారుల గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సర్పంచ్ కన్నెబోయిన యమునా ప్రవీణ్ కుమార్ యాదవ్‌కు సూచించారు. జాతరకు వారం రోజుల ముందు బాధ్యతలు చేపట్టిన ఆలయ ఈఓ ప్రసాద్ పనితీరుపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. జాతర నిర్వహణపై పూర్తి అవగాహనతో సమర్థవంతంగా వ్యవహరించాలని, ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టంగా వ్యవస్థను నిర్వహించాలని హెచ్చరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ భూముల్లో కాటేజీలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జాతరను ఘనంగా నిర్వహించి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.