epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విదేశీ ఉద్యోగాల పేరిట యువత అక్రమ రవాణా

విదేశీ ఉద్యోగాల పేరిట యువత అక్రమ రవాణా
లావోస్ సైబర్ మోసాల గ్యాంగ్ బండారం బట్టబయలు
ఉద్యోగాల ముసుగులో లక్షల వసూళ్లు.. అంతర్జాతీయ ముఠా అరాచకం
హైద‌రాబాద్ విమానాశ్రయంలో ప్రధాన నిందితుడు అరెస్ట్
థాయ్‌లాండ్ నుంచి లావోస్‌కు అక్రమ తరలింపు.. పాస్‌పోర్టులు స్వాధీనం
యువతతో సైబర్ మోసాలు చేయించిన గ్యాంగ్‌పై కేసు నమోదు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : విదేశాల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి యువతను థాయ్‌లాండ్, లావోస్ దేశాలకు అక్రమంగా తరలించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఈ ముఠా బండారాన్ని బయటపెట్టారు. కేసులో ప్రధాన నిందితుడు ఇస్లావత్ విజయేందర్ అలియాస్ ఆండ్రూ (38)ను ఫిబ్రవరి 17న హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

బ్యాంకాక్ నుంచి లావోస్‌కు అక్రమ తరలింపు

పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు తన సహచరులతో కలిసి జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతను విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. బాధితులను ముందుగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు పంపించి అక్కడి నుంచి అక్రమంగా లావోస్‌కు తరలించినట్లు వెల్లడైంది. అక్కడికి చేరుకున్న తర్వాత వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని చైనా ముఠాతో కలిసి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు చేయించేవారని పోలీసులు తెలిపారు. అమెరికా మహిళల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి క్రిప్టోకరెన్సీ, ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడేలా బాధితులను బలవంతం చేసినట్లు గుర్తించారు.

ఒక్కో వ్యక్తిపై రూ.1.75 లక్షల కమిషన్

ఈ అక్రమ రవాణా ద్వారా ఒక్కో వ్యక్తిపై సుమారు రూ.1.75 లక్షల వరకు కమిషన్ పొందినట్లు విచారణలో తేలింది. ఈ ముఠాలో మీసాల రాజశేఖర్, దండుగుల కళ్యాణ్, శ్యాంరావు రాజశేఖర్‌తో పాటు లావోస్‌లో ఉన్న రాజు (వైజాగ్) కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. బ్యాంకాక్‌లో కాల్ సెంటర్ ఉద్యోగాల పేరుతో పలువురిని విదేశాలకు పంపించి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. కొంతమంది బాధితులు మోసపోయిన విషయం తెలుసుకుని భారత్‌కు తిరిగి రాగా, మరికొందరు ఇప్పటికీ విదేశాల్లోనే ఉన్నట్లు సమాచారం.

విదేశీ ఉద్యోగాల మోసాలపై పోలీసుల హెచ్చరిక

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే అనుమానాస్పద ఏజెంట్లను నమ్మవద్దని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ యువతకు సూచించారు. విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్లు, సంస్థల గుర్తింపు వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు. మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కేసు వివరాలను వెల్లడించిన మీడియా సమావేశంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్‌ఐలు ఉమాసాగర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.