epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అంజన్న సన్నిధిలో వసూళ్ల దందా..?

అంజన్న సన్నిధిలో వసూళ్ల దందా..?
టికెట్ ఉన్నా సేవలకు అదనపు వసూళ్లు
తీర్థం నుంచి కొబ్బరికాయ వరకు రేట్లే
గ్లాస్ తీర్థం రూ.20, లీటర్ రూ.100కు విక్రయం
అన్నదానంలో పరిమితి.. భక్తులకు ఇబ్బందులు
ఆలయంలో జరుగుతున్న ఘటనలపై విచారణకు భక్తుల డిమాండ్

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల నుంచి అదనపు వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్వామి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ కొన్ని సేవల కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దైవసన్నిధిలో ఉచితంగా లేదా అధికారిక టికెట్‌తో లభించాల్సిన సేవలకు కూడా అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఉచితంగా అందాల్సిన తీర్థానికే ధరలు నిర్ణయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లాసు తీర్థానికి రూ.20, లీటర్ బాటిల్‌కు రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు. కొబ్బరికాయ కొట్టేందుకు టికెట్ ఉన్నప్పటికీ అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో పూలు, కొబ్బరికాయలు, తాగునీటి బాటిల్స్ వంటి వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, భక్తుల విశ్వాసాన్ని ఆదాయ వనరుగా మార్చుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అన్నదానంలో పరిమితి.. భక్తులకు ఇబ్బందులు

దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన సత్రంలో పరిమిత సంఖ్యలో మాత్రమే భోజనం అందిస్తున్నట్లు సమాచారం. నిర్ణీత సమయంలో వెళ్లినా టోకెన్లు అయిపోయాయని చెప్పి భోజనం ఇవ్వడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అన్నదాన నిర్వహణలో సరైన సమన్వయం లేదని విమర్శిస్తున్నారు.

అక్రమాలపై విచారణకు డిమాండ్

ఆలయంలో జరుగుతున్న వసూళ్లు, సేవల నిర్వహణపై పారదర్శకత లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ ధరల పెంపు నిర్ణయంపై గతంలో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో, ప్రస్తుతం జరుగుతున్న అదనపు వసూళ్లపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయ నిర్వహణలో పారదర్శకత తీసుకురావడంతో పాటు జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.