epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్నేహితుడే హంతకుడు..

స్నేహితుడే హంతకుడు..!
యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు ఛేదించిన పోలీసులు
స్నేహితుడు మేకల వేణుమాధవ్ రెడ్డితో ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు
త‌న‌ను మోసం చేశాడ‌ని భావించిన వేణు మాధ‌వ్‌రెడ్డి
శ్రీనివాస్ హ‌త్య‌కు సుపారీ ఇచ్చి ప్రీ ప్లాన్డ్‌గా అంతం
పాలేరు జ‌లాశ‌యంలోకి కారు దూసుకెళ్లిన‌ట్లుగా ప్ర‌మాదంగా చిత్రీక‌రించే య‌త్నం
సాంకేతిక ఆధారంగా కేసును చేధించిన ఖ‌మ్మం పోలీసులు
న‌లుగురి అరెస్టు చేసి..క‌టాక‌టాల వెన‌క్కి పంపిన ఖాకీలు

కాకతీయ, కూసుమంచి : పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో మళ్లీ కలిసిన ఇద్దరు స్నేహితులు… ఆ పరిచయం చివరకు నరహత్యగా మారింది. ఈ నెల 14న పాలేరు జలాశయంలోకి కారు దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన వెనుక రోడ్డు ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్యేనని పోలీసులు తేల్చారు. ఆదివారం రూరల్ ఎసిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రూరల్ ఎసిపి తిరుపతి రెడ్డి, కూసుమంచి సీఐ టి. సంజీవ్ కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాస్ అలియాస్ బొగ్గుల శ్రీనివాస్ (48) ఈనెల 14న పాలేరు జలాశయంలో మృతి చెందిన ఘటన మొదట అనుమానాస్పదంగా కనిపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో అసలు కథ వెలికితీశారు.

జీఎస్టీ లావాదేవీలే వివాదానికి కారణం

మృతుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. సిల్వర్ జూబ్లీ కాలేజీలో కలిసి చదివిన మేకల వేణుమాధవ్ రెడ్డి (ఏ1)తో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్లీ పరిచయం ఏర్పడింది. మృతుడికి “బొగ్గుల బిబిక్యూ” పేరిట జీఎస్టీ లైసెన్స్ ఉండగా, వేణుమాధవ్ రెడ్డి “మేకా ప్రాజెక్ట్స్” పేరిట సబ్ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. జీఎస్టీ లైసెన్స్ వినియోగించి నకిలీ ఇన్వాయిస్‌లు దాఖలు చేసి లాభాలు పొందుదామని ఇద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. 2022 నుంచి 2025 వరకు సుమారు రూ.90 లక్షలు సంపాదించగా, అందులో శ్రీనివాస్ వాటా రూ.45 లక్షలు. అయితే వేణుమాధవ్ రెడ్డి రూ.15 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా రూ.30 లక్షలు బకాయి ఉంచాడు. ఇదే సమయంలో జీఎస్టీ విభాగం నోటీసులు రావడంతో లైసెన్స్ రద్దైంది. లైసెన్స్ యాక్టివేషన్‌కు భారీ జరిమానా చెల్లించాల్సి రావడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది.

సుపారీ ఇచ్చి పక్కా ప్లాన్

ఆర్థిక ఒత్తిడి, బకాయి డబ్బుల డిమాండ్ కారణంగా ఏ1 వేణుమాధవ్ రెడ్డి, ఏ2 పోకల కోటేశ్వరరావు, ఏ3 షేక్ అబ్దుల్ హఫీజ్, ఏ4 ఎమ్.డి. అజ్మత్ అలీ ఖాన్‌లతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఏ3, ఏ4లకు రూ.5 లక్షల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈనెల 13న రాత్రి పెండింగ్ డబ్బులు ఇస్తామని చెప్పి శ్రీనివాస్‌ను వాహనంలో విజయవాడకు తీసుకెళ్లారు. 14వ తేదీ తెల్లవారుజామున నకిరేకల్–జనగాం మార్గంలోని నిర్మానుష్య ప్రాంతంలో కత్తులు, ఐరన్ రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహంతో పాటు కారును పాలేరు జలాశయంలో పడవేసి రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. హత్యలో ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. కేసు నమోదు వెంటనే ఎసిపి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.