epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం
లంచాలు తీసుకుంటే క్రిమినల్ కేసులు
అక్రమ నిర్మాణాలపై కొరడా
నిజాయితీగా పనిచేసేవారికి రక్షణ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
దళారుల వ్యవస్థ నిర్మూలనకు ఆదేశాలు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘‘ఇప్పటిదాకా ఒక లెక్క… ఇకపై మరో లెక్క’’ అంటూ ఇంటి నిర్మాణ అనుమతుల పేరుతో ప్రజలను వేధించడం, బ్రోకర్లు, ఏజెన్సీల ద్వారా లంచాలు వసూలు చేయడం సహించబోమని తేల్చిచెప్పారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టడం ఆపాలని, ప్రజలకు సులభంగా అనుమతులు అందేలా వ్యవస్థను మార్చాలని సూచించారు. ఇకపై లంచాలు తీసుకుంటే బదిలీతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో నిజాయితీగా పనిచేసే అధికారులకు పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు.

అవినీతికి తావు లేదు… ఉండలేనివారు వెళ్లొచ్చు

పట్టణ ప్రణాళిక విభాగంపై ఉన్న అవినీతి ముద్రను పూర్తిగా తొలగించాలన్నారు. అవినీతి కొనసాగించే అధికారులు ఇక్కడ కొనసాగలేరని, అలాంటివారు స్వచ్ఛందంగా బదిలీపై వెళ్లొచ్చని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించి నిబంధనలు స్పష్టంగా వివరించి వేగంగా సేవలు అందించాలని ఆదేశించారు. కార్యాలయాల చుట్టూ ప్రజలను తిరగదోపడం ఇక సహించబోమన్నారు.
దళారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. ప్రజలకు నేరుగా సేవలు అందేలా ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణ అనుమతులను పారదర్శకంగా, త్వరితగతిన మంజూరు చేసే విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

అక్రమ నిర్మాణాలపై కొరడా

అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవాలని మంత్రి ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను గుర్తించి వారం రోజుల్లో నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. నోటీసులు పట్టించుకోకపోతే కూల్చివేత చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల విషయంలో నిర్లక్ష్యం సహించబోమన్నారు.అధికారుల పనితీరుపై నిరంతర నిఘా ఉంటుందని, ప్రతి చర్యపై పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. పట్టణ ప్రణాళిక, ఆదాయ, పారిశుధ్య విభాగాలపై మూడు రోజుల్లో అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమ వసూళ్లకు పూర్తిగా చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.నగరంలో ఇంటి నిర్మాణానికి సులభంగా అనుమతులు లభించే విధానాన్ని అమలు చేసి కరీంనగర్‌ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎన్నికల హామీ మేరకు ప్రక్షాళన ప్రారంభించామని పేర్కొంటూ నెలరోజుల్లో స్పష్టమైన మార్పు కనిపించాల్సిందేనని అధికారులను హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.