epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
మెడికల్ బోర్డు నిర్వహణలో నిర్లక్ష్యం
డిస్మిస్ ఉద్యోగులకు మరో అవకాశం ఇవ్వాలి
కమిటీ సమావేశాలు వాయిదా వేయడం సరికాదు
యాజమాన్యం వైఖరిపై ఏఐటీయూసీ ఆగ్రహం

కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాజమాన్యం కార్మిక సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సింగరేణి సంస్థకు నూతన సి అండ్ ఎండీగా జ్యోతిబుద్ధ ప్రకాష్ బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమేనని పేర్కొన్న రంగయ్య, అయితే స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో ఒప్పుకున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ పేరుతో కాలయాపన చేయడం మానుకోవాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్టర్ స్థాయి సమావేశం, ప్రతి మూడు నెలలకు ఒకసారి సి అండ్ ఎండీ స్థాయి సమావేశం గుర్తింపు సంఘంతో నిర్వహించాల్సి ఉందని గుర్తుచేశారు. అయితే యాజమాన్యం ఈ సమావేశాలను పదేపదే వాయిదా వేస్తోందని విమర్శించారు. ఇది కార్మికుల సమస్యల పరిష్కారాన్ని ఆలస్యం చేస్తోందని తెలిపారు. మెడికల్ బోర్డు సక్రమంగా నిర్వహించకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వైద్య సేవల్లో జాప్యం వల్ల కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పారు. సొంత ఇల్లు పథకాన్ని అమలు చేయాలని, మారుపేర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆదాయ పన్నును కోల్ ఇండియా తరహాలో యాజమాన్యమే భరించాలని సూచించారు. డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి.రమణమూర్తి, కొత్తగూడెం ఏరియా సహాయ కార్యదర్శి గట్టయ్య, నాయకులు చందయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.