epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!
భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52 కోట్ల ఘరానా మోసం
39 పాలసీదారుల పేరిట నకిలీ మరణ క్లెయిమ్‌లు
బతికున్న వారికే డెత్ సర్టిఫికెట్‌లు సృష్టి
అంతర్గత తనిఖీలో బయటపడిన అక్రమాలు
పోలీసులకు ఫిర్యాదు… కేసు నమోదు
అధికారుల పాత్రపై పెరుగుతున్న అనుమానాలు
అశ్వాపురం ఏజెంట్లపై ఆరోపణలు

కాకతీయ, కొత్త‌గూడెం/ మణుగూరు/భద్రాచలం : సీతారామచంద్రస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం పట్టణంలో భారీ బీమా మోసం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం బీమా శాఖ పరిధిలో రూ. 1 కోటి 52 లక్షల మేర అక్రమంగా క్లెయిమ్‌లు పొందిన ఘరానా వ్యవహారం సంచలనం సృష్టించింది. అశ్వాపురం మండలానికి చెందిన ఇద్దరు ఏజెంట్లు 39 మంది పాలసీదారుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి, మరణించినట్లు చూపించి భారీగా సొమ్ము దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు ప్రాథమిక వివరాల ప్రకారం, సీతారాంపురం గ్రామానికి చెందిన ఇద్దరు ఏజెంట్లు ముందుగా కొంతమంది పేర్లపై పాలసీలు జారీ చేయించారు. అనంతరం వారిలో కొందరు మరణించారంటూ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి క్లెయిమ్‌లు పొందారు. కొన్ని సందర్భాల్లో అసలు పాలసీదారులు బ్రతికే ఉండగా, వారిని చనిపోయినట్లుగా చూపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా షాకింగ్ అంశమేమిటంటే, మరణించిన వారి పేర్లపై కూడా కిస్తీలు కట్టినట్లుగా చూపించి, తరువాత క్లెయిమ్‌లను పొందినట్లు సమాచారం. ఇలా మొత్తం రూ. 1.52 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని అంతర్గత లెక్కలు సూచిస్తున్నాయి.

అంతర్గత తనిఖీలో బయటపడిన గుట్టు

అక్రమాలపై అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు నేరుగా కొంతమంది పాలసీదారులను సంప్రదించారు. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయారంటూ క్లెయిమ్ తీసుకున్న వ్యక్తులు బ్రతికే ఉన్నారని తేలడంతో శాఖ మేనేజర్ చక్రవర్తి భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు ఏజెంట్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ పత్రాలు ఎక్కడ తయారయ్యాయి? మరణ ధ్రువీకరణ పత్రాలు ఎలా మంజూరయ్యాయి? ఇందులో మరెవరైనా సిబ్బంది ప్రమేయం ఉందా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది.

అధికారుల పాత్రపై అనుమానాలు..!

ఇంత పెద్ద మొత్తంలో క్లెయిమ్‌లు మంజూరు అవుతున్నా శాఖ స్థాయిలో ఎవరూ గమనించలేదా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సాధారణ ప్రజలకు క్లెయిమ్ రావాలంటే నెలల తరబడి పరిశీలనలు జరిగే పరిస్థితుల్లో, ఇక్కడ నకిలీ పత్రాలు ఎలా ఆమోదించబడ్డాయన్నది అనుమానాస్పదంగా మారింది. బ్రాంచ్ అధికారుల సహకారం లేకుండా ఇంత భారీ స్కామ్ సాధ్యమేనా? మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అధికారుల బాధ్యత ఏమిటి? ధృవీకరణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు చోటుచేసుకున్నాయి? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భద్రాచలం శాఖ పరిధిలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో పాలసీదారుల్లో ఆందోళన మొదలైంది. తమ సొమ్ము భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీమా సంస్థలపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఈ ఘటన దెబ్బతీసిందని స్థానికులు అంటున్నారు.

దర్యాప్తు ఆరంభం..!

ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది. నకిలీ పత్రాల సృష్టి, క్లెయిమ్ ఆమోదం, నిధుల విడుదల వరకు మొత్తం వ్యవహారాన్ని పోలీసులు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని సమాచారం. సామాన్యుల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన సంస్థలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. దర్యాప్తు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, ఈ ఘటన బీమా వ్యవస్థలోని లోపాలపై గట్టిగా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇకనుంచైనా పర్యవేక్షణ కట్టుదిట్టమవుతుందా? లేక ఇది కూడా కాలక్రమేణా మరుగునపడుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.