epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది

హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

99 రోజుల కార్యాచరణ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన 99 రోజుల కార్యాచరణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోంటాల సుహాసిని, వైస్ చైర్‌పర్సన్ గూడూరి అంజలితో పాటు కౌన్సిలర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముందు అంబేద్కర్ చౌరస్తాలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం అభివృద్ధే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి అధికార పార్టీకి అవకాశం కల్పించారని పేర్కొన్నారు. మున్సిపల్ పాలకవర్గం తీసుకునే అభివృద్ధి నిర్ణయాలకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి సుమారు రూ.300 కోట్ల ప్రతిపాదనలు మున్సిపల్ చైర్‌పర్సన్ సమర్పించారని తెలిపారు. జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో కూడా హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు గుర్తు చేశారు.ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణ చేపట్టినట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, నో డ్రగ్స్ అవగాహన, భద్రత, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.


మహిళా సంఘాల సభ్యులు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణలో భాగంగా పాడైన టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి వస్తువులను రీసైక్లింగ్‌కు ఇవ్వాలని సూచించారు. వచ్చే వర్షాకాలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరూ కలిసి పని చేయాలని, వీలైనంతవరకు స్టీల్ వస్తువులు ఉపయోగించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమవుతాయని చెప్పారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ మరియు రవాణా శాఖలు కలిసి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. యువత నో డ్రగ్స్‌కు కట్టుబడి గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పిల్లల భద్రత, విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని కోరారు.రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
హుజురాబాద్ మున్సిపల్ పాలకవర్గం ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టు మంత్రి అభినందించారు. ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హుజురాబాద్ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో హుజురాబాద్ ముందుండాలని ఆకాంక్షించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.