epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హుజురాబాద్ గులాబీలో గూటి పోరు!

హుజురాబాద్ గులాబీలో గూటి పోరు!
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి వ్య‌తిరేకంగా నేత‌ల స‌మావేశం
జ‌మ్మికుంట స‌మీపంలోని ధ‌ర్మారంలో పెద్ద సంఖ్యలో నేత‌ల భేటీ
ఎమ్మెల్యే సీనియర్లను పక్కనబెట్టారంటూ మండిపాటు
‘ఒంటెద్దు’ శైలి నిర్ణ‌యాల‌తో పార్టీకి న‌ష్టం చేస్తున్న‌ట్లు విమర్శలు
ఆయ‌న వెంట ఉంటే కేసులు త‌ప్ప‌వంటూ ఆందోళ‌న‌
కేసీఆర్‌ను క‌లిసి ప‌రిస్థితిని వివ‌రించాల‌ని సీనియ‌ర్ నేత‌ల ఆలోచ‌న‌

కాకతీయ, కరీంనగర్ బ్యూరో: హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు ఉధృతరూపం దాల్చాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంపై సీనియర్ నేతలు బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు స్వరాన్ని వినిపించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో శుక్రవారం రాత్రి గోప్యంగా నిర్వహించిన సమావేశం పార్టీలో నెలకొన్న విభేదాలను వెలుగులోకి తీసుకొచ్చింది. సుమారు వందమంది కీలక నేతలు హాజరుకావడం ఈ అసంతృప్తి తీవ్రతను స్పష్టంచేసింది. సమావేశంలో పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ బలోపేతం కన్నా వ్యక్తిగత ఆధిపత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన సీనియర్లను పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కేడర్‌లో అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు. స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో అనుసంధానం కోల్పోవడం పార్టీ బలహీనతకు దారితీస్తోందని అభిప్రాయపడ్డారు.

కేసుల భయం.. కేడర్‌లో కలకలం

వ్యక్తిగత వివాదాలను పార్టీపైకి మోపడం వల్ల కార్యకర్తలు పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. “ఆయన వెంట ఉంటే కేసులే తప్ప ప్రయోజనం లేదు” అన్న వ్యాఖ్య సమావేశంలో చర్చనీయాంశమైంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను రక్షించాల్సిన సమయంలో వారినే వివాదాల్లోకి నెట్టడం సరైంది కాదని అన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల పరాజయాలకు కూడా ఎమ్మెల్యే నిర్ణయాలే కారణమని కొందరు నేతలు విమర్శించారు. వ్యక్తిగత అజెండాతో తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న నేతలు పరిస్థితిని పార్టీ అధినేత కేసీఆర్‌కు వివరించాలని భావిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రత్యక్షంగా కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్‌కు కీలక పరీక్షగా మారాయి. అసంతృప్తి గళం ఎంతవరకు ముందుకు వెళ్తుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.