epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శవాన్ని తీసుకెళ్లాలంటే

శవాన్ని తీసుకెళ్లాలంటే
అంబులెన్స్‌ను తోయాల్సిందే!
ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ దుస్థితి
స్టార్ట్ కాక మొరాయించిన వాహనం…
చివరికి ప్రైవేట్ అంబులెన్స్ ఆశ్రయం
సిరిసిల్లలో హృదయవిదారక ఘటన

కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.ఆప్తుడిని కోల్పోయిన కుటుంబం కన్నీళ్లలో మునిగిపోతుండగానే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ మొరాయించడం కలచివేసింది.రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూలి పనులు ముగించుకొని ఆటోలో వెళ్తుండగా వాహనం బోల్తా పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అతను మృతిచెందాడు.అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి అంబులెన్స్‌ను పిలిపించారు. అంబులెన్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ స్టార్ట్ కాకపోవడంతో పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. డ్రైవర్ “స్టార్ట్ కావడం లేదు… కొంచెం తోయండి” అని చెప్పడంతో అప్పటికే దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులే అంబులెన్స్‌ను తోయాల్సిన దురవస్థ ఏర్పడింది. కన్నీళ్లు మున్నీళ్లుగా వాహనాన్ని తోసినా అది స్టార్ట్ అవలేదు.ఒకవైపు మృతదేహం… మరోవైపు మొరాయించిన అంబులెన్స్ ఈ దృశ్యం అక్కడున్న వారిని కదిలించింది.

చివరకు చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్‌కు డబ్బులు చెల్లించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాల్సి వచ్చింది.అత్యవసర సమయంలో అందాల్సిన అంబులెన్స్ సేవలు అవసరమైన వేళ విఫలమవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.“జీవితంలో చివరి ప్రయాణం కూడా ఇంత కష్టమా…? అంబులెన్స్ కోసం ఎదురుచూస్తే మనుషులే తోసుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరం” అంటూ అక్కడున్నవారు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారుల నిర్లక్ష్యంతో అంబులెన్స్ సేవలు నామమాత్రంగా మారాయని స్థానికులు విమర్శించారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయ వాహనాలను అందుబాటులో ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.