epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు

భ‌ద్రాచ‌లం ఆల‌య అభివృద్దికి భారీగా నిధులు

ముఖ్య‌మంత్రి పెద్ద మ‌న‌సుతో మంజూరు

రేపు ప‌ట్ట‌ణానికి సీఎం రేవంత్‌రెడ్డి

రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన

సీతారాముల క‌ల్యాణానికి పటువస్త్రాలు..

మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు

శ్రీరామనవమి ఏర్పాట్లు ప‌రిశీల‌న‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: శ్రీరాముడు నడయాడిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొదటి దశలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు తెలంగాణ సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మొత్తం రూ.586 కోట్లతో రామాలయంతో పాటు భద్రాచలం పట్టణాభివృద్ధిని మూడు దశల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని మిథిలా కళ్యాణ మండపం వేదికగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. శ్రీసీతారామచంద్రస్వామి దంపతులకు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారని తెలిపారు. అందుకు శుక్రవారం భద్రాచలానికి సీఎం రేవంత్‌ వస్తున్నారన్నారు. ఆయనకు ప్రజల తరఫున ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. భద్రాచలం వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్ పోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక గోదావరిలో నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటుకు అవకాశం ఉందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పనులు చేపట్టినట్లు చెప్పారు. సీతారాముల కళ్యాణం వీక్షించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై దేవాలయం అధికారులు, సిబ్బందికి మంత్రి తుమ్మల దిశా నిర్దేశం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.