epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు

పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు
భక్తులకు సులభ ప్రయాణం
వేములవాడ నుంచి కాలేశ్వరం, యాదగిరిగుట్టలకు సర్వీసులు
రవాణా సౌకర్యాల విస్తరణకు చర్యలు
బస్టాండ్ల ఆధునీకరణకు నిధుల మంజూరు
మహిళలకు ఉచిత ప్రయాణంతో లాభాలు
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సు సర్వీసులు కల్పించడం ద్వారా భక్తులకు సులభ ప్రయాణం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో నుంచి కాలేశ్వరం, యాదగిరిగుట్టలకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ నుంచి ఇతర పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సు సౌకర్యం కల్పించడం భక్తులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇప్పటికే వేములవాడ నుంచి తిరుపతికి నడుస్తున్న బస్సులు మంచి స్పందన పొందుతున్నాయని, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రాంతాలకు కూడా సర్వీసులు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి సిరిసిల్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల డిపోల నుంచి కూడా బస్సుల సంఖ్య పెంచాలని కోరినట్లు వెల్లడించారు.

బస్టాండ్ల ఆధునీకరణకు ప్రాధాన్యం

వేములవాడ బస్టాండ్ అభివృద్ధికి రూ.1.60 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కథలాపూర్, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట ప్రాంతాల్లోని బస్టాండ్లను కూడా దశలవారీగా ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. తిప్పాపూర్ బస్టాండ్ తొలగింపునకు గతంలో ప్రయత్నాలు జరిగితే తాను అడ్డుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల వారి ఆదాయం ఆదా అవుతోందని, వ్యాపార కార్యకలాపాలు కూడా పెరిగినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు జీవిత బీమా అందిస్తున్నామని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని, తిప్పాపూర్ మూడవ వంతెన, రహదారి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంబడి ఉన్న పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. త్వరలో భద్రాచలం, బాసరలకు కూడా బస్సు సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వేములవాడ–ముంబై బస్సు సర్వీస్ విజయవంతంగా నడుస్తోందని, ప్రజలు ఆర్టీసీ బస్సులను ఎక్కువగా వినియోగించాలని ఆది శ్రీనివాస్ కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.