epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు
గ‌జ్వేల్ ఘ‌ట‌న ప్రజాస్వామ్యంపై దాడే
కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై ప్ర‌ణాళిక‌తోనే దాడి
మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు
నిర‌స‌న‌గా గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు
వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా
ఉద్రిక్తతల మధ్య ఉదయం నుంచి నిలిచిన జనజీవనం

కాకతీయ,గజ్వేల్: ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, కాంగ్రెస్ గూండాలు అధికారం అండతో రెచ్చిపోయారని తన్నీరు హరీష్ రావు మాజీ మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో సోమవారం గజ్వేల్ బంద్ కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచే గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలు పూర్తిగా బంద్‌లో మునిగిపోయాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బంద్ ప్రభావంతో స్థానిక వ్యాపారులు నష్టపోయారు. కేసీఆర్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం బీఆర్ఎస్ శ్రేణులను కలిచివేసింది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉంచి నినాదాలు చేశారు. గ్రామ పాలన మీటింగ్‌లో ఫ్లెక్సీ తొలగింపుతో ప్రారంభమైన వివాదానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది.

గజ్వేల్ చరిత్రలో ఇది రెండోసారి

గజ్వేల్ రాజకీయాల్లో క్యాంపు కార్యాలయం లక్ష్యంగా మారడం రెండోసారి జరిగింది. గతంలో బీజేపీ నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఎలాంటి ధ్వంసం జరగలేదు. కానీ తాజా ఘటనలో అద్దాలు పగలగొట్టడం, ఫర్నిచర్ ధ్వంసం జరిగిందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. రెండు నిరసనల తీరులో స్పష్టమైన తేడా కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ అరాచకానికి ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా గజ్వేల్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆంక్షారెడ్డి ప్రయత్నం.. ఉద్రిక్తత

బంద్‌ను వ్యతిరేకిస్తూ ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు షాపులు తెరిపించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదాలు, స్వల్ప తోపులాటలు జరిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు ఆంక్షారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఘటన సమయంలో పోలీసులు ఉన్నప్పటికీ అడ్డుకోలేదని బీఆర్ఎస్ విమర్శించింది. మధ్యాహ్నం వరకు బంద్ కొనసాగింది. ఆ తర్వాత షాపులు తిరిగి తెరుచుకున్నాయి. రోడ్లపై రద్దీ కనిపించింది. గజ్వేల్‌లో పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది. ఈ ఘటన గజ్వేల్ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకువస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్‌కు రాకపోవడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఈ వివాదం మరింత వేడెక్కింది.
రాజకీయాల వల్ల వ్యాపారం దెబ్బతినకూడదని వ్యాపారులు కోరుతున్నారు. పార్టీలు సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. గజ్వేల్‌లో శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.