నాయీబ్రాహ్మణ సేవాసంఘం సమావేశం
సభ్యత్వ నమోదు చేపట్టి ఎన్నికలకు సన్నాహాలు
కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలోని నాయీబ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నీలం మొండయ్య నాయీ, జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల సంపత్ నాయీలు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గౌరవ అధ్యక్షులు ఔదుర్తి లక్ష్మణ్ కుమార్ నాయీ, జిల్లా ఉపాధ్యక్షులు జంపాల భిక్షపతి నాయీ హాజరై మాట్లాడారు. మండలంలో నాయీబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సభ్యత్వ నమోదు చేపట్టేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా తిప్పబత్తిని నారాయణ నాయీ, తిప్పబత్తిని కుమారస్వామి నాయీ, దుబ్బాక నర్సయ్య నాయీ, సూత్రపు సంపత్ నాయీ, జంపాల సమ్మయ్య నాయీ నియమితులయ్యారు. మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్లి సంఘ సభ్యులను చేర్చాలని, సభ్యత్వ నమోదు పూర్తైన అనంతరం మండల స్థాయి ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని సీనియర్ నాయకులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

