epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప‌థ‌కాల అమ‌లులో ప్ర‌భుత్వం విఫ‌లం

ప‌థ‌కాల అమ‌లులో ప్ర‌భుత్వం విఫ‌లం
రైతు భరోసా, కల్యాణ లక్ష్మి హామీలు ఏమయ్యాయి?
సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డం లేదు
మేడిగడ్డ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యం
మ‌ళ్లీ ఉద్య‌మం నాటి రోజులు క‌నిపిస్తున్నాయి..
జ‌గిత్యాల‌లో కేసీఆర్ బ‌హిరంగ స‌భ భారీ స‌క్సెస్‌
బీఆర్ఎస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌ల‌తో దాడి చేసిన సీనియ‌ర్ లీడ‌ర్‌

కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు లభించిన భారీ స్పందన తెలంగాణ ఉద్యమ రోజులను తలపించిందని మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉంటే, నేడు పరిస్థితి తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు వంటి పథకాలతో గత ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా సహా కీలక హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జీవన్‌రెడ్డి విమర్శించారు. పంటల బీమా పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని, భూమిలేని రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలను నిలిపివేశారని ఆరోపించారు. కల్యాణ లక్ష్మి పథకం కింద బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పారని, కేసీఆర్ కిట్ వంటి పథకాల పేర్లు మార్చినా కనీసం వాటిని సరిగ్గా కొనసాగించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రాష్ట్ర వాటా చెల్లించకపోవడం వల్ల కేంద్ర నిధులు కూడా నిలిచిపోయాయని పేర్కొన్నారు.

మేడిగడ్డపై ప్రభుత్వం కావాలనే కాలయాపన..

మేడిగడ్డ ప్రాజెక్టు దెబ్బతిని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మరమ్మతులు చేపట్టకుండా కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమైందని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నివేదికలు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం వెనుక కేసీఆర్‌పై బురద చల్లే ప్రయత్నం కనిపిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దేనని, మేడిగడ్డ పునర్నిర్మాణం కూడా ఆయనతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందని, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, హోమ్ గార్డులు అందరూ అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

ప్రజల ఆత్మగౌరవం కోసమే ఈ నిర్ణయం..

కాంగ్రెస్ పార్టీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారని ఆరోపిస్తూ, తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసమే తాను రాజకీయ నిర్ణయాలు తీసుకున్నానని వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, దావా వసంత, లోక బాపురెడ్డి, హరిచరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.