వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మధ్యవర్తులను నమ్మి రైతులు మోసపోవద్దు
ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్
కాకతీయ, శంకరపట్నం: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా శంకరపట్నం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం మండల కేంద్రంలోని కేశవపట్నం వ్యవసాయ మార్కెట్‌తో పాటు తాడికల్ గ్రామంలో ఈ కొనుగోలు కేంద్రాలను మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి కలిసి ఘనంగా ప్రారంభించారు.
మద్దతు ధరతోనే మేలు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రైతులు అధికారుల సూచనలు పాటిస్తూ, ధాన్యాన్ని ఆరబోసి నాణ్యతా ప్రమాణాల మేరకు (తడి లేకుండా) తీసుకురావాలని కోరారు.
తరలివచ్చిన నేతలు, అధికారులు
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ తణుకు ప్రభాకర్, సర్పంచులు దుర్గపు సుజాత, గోదారి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గొట్టే మధు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్, బూత్ అధ్యక్షుడు అజయ్, ఏఈఓలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

