బాధిత కుటుంబాలకు ఎర్రబెల్లి పరామర్శ
కాకతీయ, రాయపర్తి: మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పరామర్శించారు. మండలంలో పర్యటించిన ఆయన.. బంధనపల్లిలో గుగులోత్ కేలి, సన్నూరులో కోతి వెంకటేశ్వర్లు, వాంకుడోత్ తండాలో కునుసోత్ పాండు నాయక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మూనావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్, బంధనపల్లి సర్పంచ్ గుగులోత్ అక్రీ రాంజీ నాయక్, పూస మధు, లేతాకుల రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

