ఏనుమాముల మార్కెట్లో సీసీ కెమెరాల ఏర్పాటు
ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
రక్షణ కోసం మొత్తం 125 కెమెరాలు
కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాష్ట్ర కొండా సురేఖ శనివారం ప్రారంభించారు. మార్కెట్ ప్రాంగణంలో నిఘాను పెంచేందుకు మొత్తం 100 కెమెరాలను అమర్చినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్లో మరో 25 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మార్కెట్కు వచ్చే రైతులు, వ్యాపారుల భద్రతతో పాటు ధాన్యం నిల్వల రక్షణ కోసం ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డా. సత్యా శారద, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, డీఎంవో కే. సురేఖ పాల్గొన్నారు. మరియు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్. మల్లేశం, చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, కార్యదర్శి మాడూరి వేదప్రకాష్, జాయింట్ సెక్రటరీ సాగర్ల శ్రీనివాస్, కాటన్ సెక్షన్ అధ్యక్షులు చింతలపల్లి వీరారావు, గ్రేడ్-2 కార్యదర్శి ఎస్. రాము, ఏఎస్లు జి. రాజేందర్, ఎన్. అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

