ముదిగొండలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
కేరళలో చారిత్రాత్మక విజయంపై హర్షం
పటాకులు పేల్చి మిఠాయిలు పంచుకున్న కార్యకర్తలు
కాకతీయ, ముదిగొండ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభంజనం సృష్టించి ఘనవిజయం సాధించిన సందర్భంగా ముదిగొండ మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. మండల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన కూడలి వద్ద బాణసంచా కాల్చి, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేరళ ఫలితాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని హర్షం వ్యక్తం చేశారు. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, అభివృద్ధి మరియు సంక్షేమానికి కేరళ ప్రజలు పట్టం కట్టారని కొనియాడారు. ఈ విజయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతమని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయోత్సవాల్లో మాజీ జడ్పీటీసీ మందరపు నాగేశ్వరావు, ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్, నాయకులు మల్లెల అజయ్, మీగడ శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు మందరపు ఉపేందర్ రావు పాల్గొన్నారు. వారితో పాటు ఇరుకు కొరివి, అలకుంట భద్రయ్య, సామినేని నాగేశ్వరావు, బురుగు శ్రీను, కొమ్ము నరసింహారావు, వీర్ల ముధాకర్, బుర్ర శ్రీను, మాణిక్యం అఖిల్, బాబా, వీర నారాయణ తదితరులు వేడుకల్లో పాల్గొని మిఠాయిలు పంచుకున్నారు.

