సింగిల్ విండో చైర్మన్గా కొండల్ రెడ్డి బాధ్యతలు
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారుల చర్యలు
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ సింగిల్ విండో సహకార బ్యాంకు చైర్మన్గా ఎడవల్లి కొండల్ రెడ్డి తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత పాలకవర్గమే తిరిగి బాధ్యతలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సింగిల్ విండో కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కొండల్ రెడ్డి చైర్మన్గా బాధ్యతలు చేపట్టగా, వైస్ చైర్మన్గా ముద్రబోయిన శంకర్ పదవీ స్వీకారం చేశారు.
పాలకవర్గ సభ్యులుగా కోడూరు ప్రభాకర్ రెడ్డి, దండ భాస్కర్ రెడ్డి, జి. శ్రీనివాస్, వై. సుజాత, బి. అనసూయ, పి. ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి, రవీందర్, లింగారావు, లోకిని సాయిలు, ఎం. లక్ష్మారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరిగి బాధ్యతలు స్వీకరించిన చైర్మన్తో పాటు పాలకవర్గాన్ని సింగిల్ విండో సీఈవో గోస్కుల వివేకానంద, మహేందర్ రెడ్డి, విజయ తదితర సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

