epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజా పాలన కాదు.. ఇది ప్రజా వంచన పాలన!

ప్రజా పాలన కాదు.. ఇది ప్రజా వంచన పాలన!
హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం
ఎర్ర‌టి ఎండ‌ల్లో రోడ్డుకెక్కుతున్న అన్నదాతలు
మూడు పంటల ‘రైతు భరోసా’ను కాంగ్రెస్‌ సర్కారు అటకెక్కించింది
కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కోతల్లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి
తూకం వేసిన ధాన్యానికి 24 గంటల్లోగా అన్‌లోడ్‌ ప్రక్రియ పూర్తి చేయాలి
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ధ్వజం

కాక‌తీయ‌, జ‌గిత్యాల : రాష్ట్రంలో ప్రజా పాలన నెపంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దారుణంగా వంచిస్తోందని, ఇక్కడ సాగుతోంది ప్రజా పాలన కాదు.. “ప్రజా వంచన పాలన” అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ ఛైర్పర్సన్ దావా వసంత సురేష్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరన్ రావు తదితరులు పాల్గొన్నారు.

రైతుల కడుపు మండి రోడ్డుకెక్కారు
మార్కెట్లలో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదని, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. పూడూరులో రైతులు ఆందోళన చేపడితే తప్ప అధికారుల్లో చలనం రాలేదని విమర్శించారు. గతేడాది జగిత్యాలలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి గాను 1.40 లక్షల టన్నులు సేకరించారని, కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 20 వేల క్వింటాళ్లు మాత్రమే సేకరించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. రైతులకు నష్టం కలగకుండా ఎలాంటి తరుగు (కోత) లేకుండా 40 కిలోల 600 గ్రాముల చొప్పున ధాన్యం సేకరించాలని, తూకం వేసిన ధాన్యాన్ని 24 గంటల్లోగా ఆన్‌లోడ్ చేయాలని డిమాండ్ చేశారు.

అటకెక్కిన రైతు భరోసా.. సగం మందికే రుణమాఫీ
రాహుల్ గాంధీతో డిక్లరేషన్ చేయించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మూడు పంటల రైతు భరోసాను ఎగ్గొట్టిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. రైతు బంధు కింద ఇవ్వాల్సిన రూ. 10 వేలు కూడా ఇగ్గొట్టారని ఎద్దేవా చేశారు. రూ. 2 లక్షల రుణమాఫీని కేవలం సగం మందికే వర్తింపజేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పంటల బీమా ప్రీమియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ 25 శాతం వాటాను చెల్లించలేక ఆ పథకాన్నే పక్కనబెట్టాయన్నారు.

బెదిరింపులు ఆపండి.. కల్లాలు ఖాళీ చేయాలి
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. కల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేసిన రైతులు, మహిళలపై దాడులు చేయడం దారుణమన్నారు. గింజ కటింగ్ లేకుండా, హమాలీ చార్జీలు లేకుండా కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూసుకోవాలన్నారు. ప్రస్తుతం బస్తాకు 3 కిలోల చొప్పున కటింగ్ జరుగుతోందని, తరుగు లేకుండా తూకం వేస్తే తాను రాజకీయం నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. మాజీ జెడ్పీ ఛైర్మన్‌ దావా వసంత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్షతో గెలిచిన సంజయ్, ఇప్పుడు అధికార పార్టీ పంచన చేరడం సిగ్గుచేటన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆయిల్నేని వెంకటేశ్వర రావు, శీలం ప్రవీణ్ కుమార్, దావా సురేష్, ఆయిల్నేని సాగర్ రావు, గాజుల రాజేందర్, కళ్లేపల్లి దుర్గయ్య, మాసర్తి రమేష్, ధర రమేష్ బాబు, నేహాల్, దేవేందర్ నాయక్, సామల రాజశేఖర్, పొట్టవతిని సతీష్, శీలం సురేందర్, నల్ల స్వామి, కే. వంశీ, చింతకింది నరేష్, మునీందర్ రెడ్డి, చెట్పల్లి సుధాకర్, శ్రీరాముల గంగాధర్, మహిపాల్, నక్క జీవన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.