ఘనంగా రెడ్ క్రాస్ జెండా ఆవిష్కరణ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్‌లో వరల్డ్ రెడ్ క్రాస్ డే వేడుకలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్‌లో జిల్లా చైర్మన్ పెండ్యాల కేశవ రెడ్డి రెడ్ క్రాస్ జెండాను ఆవిష్కరించారు. మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే రెడ్ క్రాస్ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం నగరంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఇదే సందర్భంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మాజీ కార్పొరేటర్ కోల మాలతి, న్యాయవాది కోల సంపత్ రెడ్డి, లిబర్టీ ఇన్సూరెన్స్ ఏరియా మేనేజర్ పి. శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ ఎండీ నసీరిద్దీన్ తదితరులు రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ట్రెజరర్ పోరెడ్డి శ్రీహరి రెడ్డి, కమిటీ సభ్యులు ఇంజనీర్ కోల అన్నా రెడ్డి, ఎలగందుల మునీందర్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

