నూతన బోర్ ను ప్రారంభించిన సర్పంచ్ సుధారాణి
కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని పెద్ద తండా గ్రామపంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆ గ్రామ సర్పంచ్ బాదావత్ సుధారాణి సురేష్ నాయక్ అన్నారు. ప్రజల అవసరాలే మా ప్రాధాన్యం పెద్దతండ గ్రామపంచాయతీ లో సర్పంచ్ సుధారాణి, ఉపసర్పంచ్ రమేష్, వార్డ్ మెంబర్లు ఆధ్వర్యంలో నూతన బోరు ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్దే లక్ష్యంగా పాలకవర్గం ముందుకు సాగుతుందని విమర్శలు చేసేవారు చాలా మంది ఉంటారు కానీ పనులు చేసి చూపించే నాయకత్వం మా పాలకవర్గం ది అన్నారు. పెద్దతండా ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి మార్గంలో మరిన్ని పనులకు శ్రీకారం చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాదావత్ సురేష్ నాయక్, వార్డ్ మెంబర్లు బానోత్ సురేష్, బాధావత్ రమేష్, బాదావత్ రమేష్, అనిత, పాల్త్య లక్ష్మి, బాదావత్ రాజు, బాదావత్ బాల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బాదావత్ వీరన్న, మరియు గ్రామ ప్రజలు బాలకృష్ణ, బిక్షపతి, రవి, తరుణ్, సురేష, గ్రామ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.

