epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వారం రోజుల్లో  ధాన్యం సేకరణ పూర్తవ్వాలి

వారం రోజుల్లో  ధాన్యం సేకరణ పూర్తవ్వాలి
రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్లు సహకరించాలి
రూ.237.39 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ
కలెక్టరేట్ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో వరి ధాన్యం, మొక్కజొన్న సేకరణ, రవాణా ఇబ్బందులపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, రైస్ మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో ఈ సీజన్‌కు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా.. 314 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం వచ్చిందని మంత్రి తెలిపారు. ఇందులో 1.58 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయిందని, మిగిలిన 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వారంలోగా సేకరించాలన్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 63 శాతం మేరకు రూ.237.39 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
అన్‌లోడింగ్ ఆలస్యంపై ఆగ్రహం
ధాన్యం రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా లారీల సంఖ్యను పెంచాలని మంత్రి సూచించారు. మిల్లుల్లో అన్‌లోడింగ్ ఆలస్యం కావడం వల్ల లారీలు రెండు రోజుల పాటు నిలిచిపోతున్నాయని, రోజుకు 150 లారీలు అందుబాటులో ఉన్నా మిల్లుల వద్ద వేగం లేకపోవడం వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతింటోందని మండిపడ్డారు. మిల్లర్లు అదనపు హమాలీలను ఏర్పాటు చేసుకుని దిగుమతిని వేగవంతం చేయాలన్నారు. బీహార్ హమాలీలపైనే కాకుండా స్థానిక హమాలీలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. సిబ్బంది కొరత ఉన్న ప్యాక్స్ కేంద్రాల కంటే మహిళా సంఘాలు నిర్వహించే ఐకేపీ కేంద్రాలను ప్రోత్సహించాలని మంత్రి పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోల నుంచి మొదలుకొని జిల్లా స్థాయి సివిల్ సప్లయ్స్, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో సన్న బియ్యం కొరత రాకుండా ఉండేందుకు వీలుగా, రైతులు సన్న ధాన్యం సాగు పెంచేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.