epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మత్తులో ఎక్సైజ్ శాఖ

మత్తులో ఎక్సైజ్ శాఖ
భద్రాచలంలో జోరుగా మద్యం అక్రమ దందా
పత్రికల్లో కథనాలు వచ్చినా కదలని యంత్రాంగం
బెల్ట్ షాపులతో స్థానికులకు తప్పని తిప్పలు
కాకతీయ, భద్రాచలం (మ‌ణుగూరు) : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణంతో పాటు  పరిసర ప్రాంతాల్లో మద్యం అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి నివాస ప్రాంతాల మధ్యే బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి, అనుమతి లేని సమయాల్లోనూ యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. మద్యం సిండికేట్లుగా మారిన కొందరు వ్యాపారులు మద్యం బాటిళ్లపై ఎమ్మార్పీ కంటే అదనపు ధరలు వసూలు చేస్తూ సామాన్యులను నిలువునా దోచుకుంటున్నారు. ఈ దందాపై గత నాలుగు రోజులుగా పత్రికల్లో వరుసగా కథనాలు వస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు, రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున కమిషన్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కాలనీల్లో మద్యం బాబుల న్యూసెన్స్
పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన నివాస ప్రాంతాల మధ్యే ఈ అక్రమ విక్రయాలు సాగుతుండటంతో మహిళలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మద్యం బాబుల న్యూసెన్స్ భరించలేకపోతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం, నిశ్శబ్దం అక్రమార్కులకు మరింత బలాన్ని చేకూరుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం, మణుగూరు ప్రాంతాల్లో సాగుతున్న మద్యం దందాపై సమగ్ర విచారణ జరిపించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి అక్రమార్కులకు సహకరిస్తున్న అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో స్థానిక ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.