epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీపీ వర్సెస్ ఎమ్మెల్యే

సీపీ వర్సెస్ ఎమ్మెల్యే
ఎల్‌ఎండీ స్టేషన్‌లో స్తంభించిన పాలన
నాలుగు నెలలుగా ఇన్‌చార్జ్ చేతిలోనే పీఎస్ నిర్వ‌హ‌ణ‌
బదిలీపై వచ్చినా.. రెండు వారాలుగా బాధ్యతలు చేపట్టని సీఐ రమేశ్
గతంలో సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌పై చర్యలే వివాదానికి ప్రధాన కార‌ణ‌మా..?
ఈ స్టేష‌న్‌లో పోస్టింగ్ అంటేనే వెనకడుగు వేస్తున్న అధికారులు
కాక‌తీయ‌,క‌రీంన‌గ‌ర్ :  కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం పోలీస్, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం నేడు స్టేషన్ పరిపాలనను కుంటుపడేలా చేసింది. ఇద్దరు పెద్దల పంతాల మధ్య పోలీస్ స్టేషన్‌కు పూర్తి స్థాయి అధికారి కరువవ్వడంతో శాంతిభద్రతల పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎల్‌ఎండీ స్టేషన్‌లో పనిచేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌పై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం ఈ వివాదానికి బీజం వేసింది. ఈ చర్యలపై స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీస్ కమిషనర్ తీరును తప్పుపట్టారు. నాటి నుంచి ఇరుపక్షాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ అంతర్గత పోరు ప్రభావమే ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్ నియామకాలపై పడుతోంది.
బదిలీ అయినా.. కుర్చీ ఖాళీనే!
ఇటీవల ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బొల్ల రమేశ్ రెండు వారాలు దాటుతున్నా ఇప్పటివరకు బాధ్యతలు చేపట్టకపోవడం కమిషనరేట్‌లో చర్చనీయాంశమైంది. సాధారణంగా బదిలీ ఉత్తర్వులు రాగానే బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా.. ఇక్కడ జాప్యం జరగడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా గత నాలుగు నెలలుగా ఈ పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లేక, కేవలం ఇన్‌చార్జ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలోనే సాగుతోంది. దీనివల్ల కీలకమైన కేసుల దర్యాప్తు, సిబ్బంది సమన్వయం లోపించి బాధితులకు న్యాయం జరగడం లేదు.
పోస్టింగ్ అంటేనే జంకు..
ఎల్‌ఎండీ స్టేషన్‌లో మితిమీరిన రాజకీయ జోక్యం, ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం పోలీస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు అధికారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆ పోలీస్ స్టేషన్‌కు పోస్టింగ్ అంటేనే అధికారులు వెనకడుగు వేస్తున్నారని సిబ్బందే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ రాజకీయాన్ని పక్కనబెట్టి, స్టేషన్‌కు పూర్తి స్థాయి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.