epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

50 రోజులైనా ధాన్యం కొనరా?

50 రోజులైనా ధాన్యం కొనరా?
వేములవాడ రోడ్డుపై రైతుల రాస్తారోకో
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయింపు
కాకతీయ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై రైతాంగ ఆగ్రహం భగ్గుమంది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తెచ్చి 50 రోజులు గడిచినా కొనుగోలు చేయకపోవడం దారుణమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సోమవారం వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు చందుర్తి మండల కేంద్రంలోని వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించి ధర్నాను విరమింపజేశారు. అనంతరం రైతులు తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి కార్యాలయం ఎదుట మరోసారి బైఠాయించారు.
తూకాల్లో కోతలు పెట్టవద్దు
గంటకు పైగా సాగిన నిరసన అనంతరం తహసీల్దార్ లైసెట్టి భూపతి, ఏపీఎం కళ్యాణిలకు రైతులు వినతిపత్రం అందజేశారు. తూకాల్లో ఎలాంటి కోతలు లేకుండా వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మ్యాకల ఎల్లయ్య మాట్లాడుతూ.. వరి కోసి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు కల్లాల వద్దే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. ఎండల తీవ్రతకు ధాన్యం ఎండిపోయి క్వింటాలుకు 10 కిలోల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు రాకముందే కొనుగోళ్లు వేగవంతం చేయాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మరాటి మల్లిక్, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, డప్పుల అశోక్, ఏనుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.