epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బదిలీల్లో.. ‘పైరవీ’ల జోరు!

బదిలీల్లో.. ‘పైరవీ’ల జోరు!
అనుకూల పోస్టింగుల‌కు అధికారుల పరుగులు
రంగంలోకి ద్వితీయ శ్రేణి నేతలు.. జోరుగా లాబీయింగ్‌
పోస్టింగుల కోసం కీలక శాఖల్లో లావాదేవీలు?
ఉన్నతాధికారులతో యూనియన్ నేతల బేరసారాలు
నిబంధనల నడుమ రాజకీయ ఒత్తిళ్లు.. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు అనుమతులు ఇవ్వడంతో కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కసారిగా సందడిగా మారాయి. అయితే ఈ సాధారణ బదిలీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ‌ శాఖల ఉద్యోగులు, అధికారులు తమకు అనుకూల పోస్టింగ్‌ల కోసం పైస్థాయి అధికారుల చుట్టూ తిరుగుతుండగా, కార్యాలయాల్లో పైరవీల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, ఖజానా, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల్లో బదిలీల అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు పొందేందుకు పలువురు ఉద్యోగులు రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల సహకారం కోరుతున్నారు. తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సహాయ ఇంజనీర్లు, వ్యవసాయ అధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులు, నీటిపారుదల శాఖ అధికారుల వరకు తమకు అనుకూల స్థానాల్లో కొనసాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు రాష్ట్రస్థాయి అధికారులను, మరికొందరు మంత్రులను సంప్రదిస్తూ తీవ్రంగా లాబీయింగ్‌ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
వసూళ్ల ఆరోపణలు.. నేతల జోక్యం
ఈ బదిలీల వ్యవహారంలో కొందరు ద్వితీయశ్రేణి రాజకీయ నేతలు కూడా రంగప్రవేశం చేశారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అనుకూల పోస్టింగ్‌లు ఇప్పిస్తామంటూ సదరు నేతలు భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే చర్చ ఉద్యోగ వర్గాల్లో నడుస్తోంది. కీలక శాఖల్లో బదిలీల జాబితాల్లో చివరి నిమిషంలో పేర్లు మార్పులు చేయించేందుకు మధ్యవర్తులు సచివాలయం, నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తమ సీట్లు కదలకుండా ఉండేందుకు తమకున్న ప్రభావాన్ని గట్టిగా వినియోగిస్తున్నారు. గరిష్ఠంగా బదిలీలు నలభై శాతం మించకూడదనే ప్రభుత్వ నిబంధనను అడ్డంగా పెట్టుకుని, బదిలీల జాబితా నుంచి ఎలాగైనా తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఒకే చోట కొనసాగేందుకు ఉద్యోగుల మధ్య అంతర్గతంగా తీవ్ర పోటీ నెలకొంది.
ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు పూర్తి చేసి సీనియారిటీ జాబితాలు, ఖాళీల వివరాలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఉద్యోగుల ఐచ్ఛికాల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. నిబంధనల ప్రకారం మూడేళ్లు ఒకేచోట పనిచేసిన వారు బదిలీకి అర్హులు కాగా,唤 నాలుగేళ్లు పూర్తిచేసిన వారికి బదిలీ తప్పనిసరి కానుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందోనన్న ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది. పారదర్శకంగా జరగాల్సిన బదిలీల్లో రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతుండటంతో, ఎలాంటి పైరవీలు లేని సాధారణ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం అర్హులైన వారికి న్యాయం జరుగుతుందో లేదోనని ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.