మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
జమ్మికుంట మార్కెట్ యార్డులో పరిశీలన
కాకతీయ, జమ్మికుంట : కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల నుంచి పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపడంలో విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం జమ్మికుంట మార్కెట్ యార్డులోని మక్క కొనుగోలు కేంద్రాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడిచినా గన్నీ బ్యాగులు, రవాణా, తూకం సిబ్బంది వంటి కనీస వసతులు కల్పించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400 నిర్ణయిస్తే, ఇక్కడి అధికారులు ట్రేడర్లతో కుమ్మక్కై రూ.1,600 నుండి రూ.1,800లకే కొంటూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. యార్డులోని మక్కలన్నింటినీ మద్దతు ధరకే కొనుగోలు చేయాలని, రైతులను మోసం చేస్తున్న ట్రేడర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్ యాదవ్, కొలకాని రాజు, పుప్పాల రఘు, కనుమల్ల గణపతి, ఆకుల రాజేందర్, సంపత్ రావు, సంపెల్లి సంపత్ రావు, పుప్పాల రాజారం, శీలం శ్రీనివాస్, రాజేష్ ఠాగూర్, రాజ్‌కుమార్, ఆవుల తిరుపతి, జీడి మల్లేష్, మెరుగు శ్రీనివాస్, తూర్పాటి శంకర్, గంగేశ్, ప్రశాంత్ పాల్గొన్నారు.

