epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మామిడి తోటల్లో హైటెన్షన్ వైర్ల మంటలు

మామిడి తోటల్లో హైటెన్షన్ వైర్ల మంటలు
నాలుగు టన్నుల పంట దగ్ధం
గాలి దుమారంతో ఒకదానికొకటి తాకిన విద్యుత్ తీగలు
ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లెలో ఘ‌ట‌న‌

కాకతీయ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లె గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ మామిడి తోట సమీపంలో ఉన్న విద్యుత్ హైటెన్షన్ వైర్లు గాలి దుమారానికి ఒక్కదానిపై ఒకటి తాకడంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న మామిడి తోటలకు వేగంగా వ్యాపించడంతో కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు, చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ చింతమడక కళ్యాణ్, ఉపసర్పంచ్ చిక్కుడు సత్యం, గ్రామస్థులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు శ్రమించారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ రాధారపు సురేష్, జీపీఓ రాజు, యువజన సంఘాల సభ్యులు నీటి ట్యాంకర్‌ను అక్కడికి తీసుకొచ్చి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

గాలికి ఎగసిపడిన మంటలు
వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత, ఈదురుగాలుల వల్ల మంటలు క్షణాల్లో తోట అంతటా విస్తరించాయి. మంటలు ఆర్పేలోపే తోటలోని చెట్లు, కోత దశకు వచ్చిన మామిడి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో సుమారు నాలుగు టన్నుల మేర మామిడి పంట పూర్తిగా కాలి బూడిదైనట్లు రైతు, సర్పంచ్ మామిడి కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుకున్న తోట కండ్ల ముందే బూడిదవడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామ శివార్లలో జోలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలను సరిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి వేలాడుతున్న తీగలను సరిచేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన మామిడి రైతును ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.