epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జూన్ 4 డెడ్ లైన్‌

జూన్ 4 డెడ్ లైన్‌
ధాన్యం సేక‌ర‌ణ‌లో ఆ తేదీ మించొద్దు
ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్ల‌ను పూర్తి చేయాలి
తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై కఠిన చర్యలు
గన్నీ సంచుల కొరత లేదు.. ప్రతి గింజను కొనుగోలు చేయాలి
తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకే కొని మిల్లులకు తరలించాలి
అధికారుల‌కు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఆదేశాలు
ధాన్యం,మొక్క‌జొన్న కొనుగోళ్ల‌పై ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స్థాయిలో స‌మీక్ష‌
రైతులు అధైర్య ప‌డొద్దు.. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుద‌ని భ‌రోసా

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జూన్ 4వ తేదీలోగా సంపూర్ణంగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ధాన్యం కొనుగోళ్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వాతావరణ శాఖ జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో, జూన్ 3వ తేదీ నాటికే ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో గన్నీ సంచుల కొరత లేదని, ఈ యాసంగి సీజన్‌కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచామని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యంలో తాలు, తరుగు పేరుతో కోతలు విధించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసి వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని, ప్రభుత్వానికి సహకరించే రైస్ మిల్లర్లకు అదనపు బాయిల్డ్ రైస్ టార్గెట్లు కేటాయిస్తామని వెల్లడించారు.

రవాణాకు ఇసుక లారీల మళ్లింపు
ధాన్యం రవాణాను వేగవంతం చేసేందుకు ఇసుక రవాణాకు వినియోగిస్తున్న లారీలను తాత్కాలికంగా కొనుగోలు కేంద్రాలకు మళ్లించాలని మంత్రి సూచించారు. అవసరమైతే లారీలు, డీసీఎంలను రిక్విజిషన్ చేసి ధాన్యం తరలింపునకు వినియోగించాలని ఎస్పీలు, ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా గోదాములలో నిల్వ స్థలాల కేటాయింపుపై పౌర సరఫరాల కమిషనర్ సమన్వయం చేసుకోవాలన్నారు. జనగామ జిల్లా ధాన్యానికి యాదాద్రిలో, వరంగల్ జిల్లా ధాన్యానికి భూపాలపల్లిలో నిల్వ స్థలాలు కేటాయించాలని, అవసరమైతే ప్రైవేట్ గోదాములను కూడా వినియోగించుకోవాలని కలెక్టర్లకు తెలిపారు.

రూ. 10,500 కోట్ల చెల్లింపులు పూర్తి
ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8.5 లక్షల మంది రైతులకు రూ. 10,500 కోట్ల చెల్లింపులు పూర్తి చేశామన్నారు. కేంద్రం కొనుగోలు చేసినా చేయకపోయినా రైతుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆర్డీవోలు, సివిల్ సప్లై, రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కె.ఆర్. నాగరాజు, పాడి కౌశిక్ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, హన్మకొండ, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల కలెక్టర్లు చాహాట్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్య శారద, బొర్ఖడే హేమంత్ సహదేవ్ రావు, సందీప్ కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.