రూ.20.80 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
38, 39వ డివిజన్‌లలో పనులను ప్రారంభించిన మేయర్
ఓపెన్ జిమ్ ప్రారంభం.. నాణ్యతగా పూర్తి చేయాలని ఆదేశం
కాకతీయ, కరీంనగర్ : నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నట్లు నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 38, 39వ డివిజన్‌లలో శుక్రవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 38వ డివిజన్‌లో సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించడంతో పాటు రూ.10.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 39వ డివిజన్‌లో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, కల్వర్టు పనులకు మేయర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయన్నారు. ఎక్కడా రాజీ పడకుండా పనులను నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు దేవసాని సరస్వతి, మాసం గణేష్, ఎన్నం లక్ష్మి, గాజ రామ, కె.ఎపిపి చంద్ర, కాలనీ వాసులు, అధికారులు పాల్గొన్నారు.

