epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్ఐఆర్ కచ్చితమైన ఓటర్ల జాబితా

ఎస్ఐఆర్ కచ్చితమైన ఓటర్ల జాబితా
: సీఈసీ జ్ఞానేశ్ కుమార్
విపక్షాల విమర్శల వేళ కమిషనర్ స్పష్టీకరణ
రేయింబవళ్లు ఒత్తిడి ఉన్నా పారదర్శకతతో పనిచేస్తున్నారు
ఎన్నికల అధికారులపై ప్రశంసలు
11 లక్షల మంది అధికారులు, 15 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్ల కృషితోనే ఇది సాధ్యం

కాక‌తీయ‌,నేష‌న‌ల్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్​ఐఆర్​) ప్రక్రియపై దేశంలో విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన, నమ్మకమైన ఓటర్ల జాబితాల్లో ఒకటని ఆయన స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన, రేయింబవళ్లు ఎన్నో ప్రతికూల ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా పూర్తి పారదర్శకతతో ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నందుకు ఎన్నికల అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
జాబితాల రూపకల్పనలో క్షేత్రస్థాయి పరిశీలన అత్యంత పకడ్బందీగా సాగుతోందని సీఈసీ వివరించారు. “దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా బూత్ స్థాయి ఏజెంట్లు, అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల జిల్లా, రాష్ట్ర అధ్యక్షుల పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ జరుగుతోంది. వీరితో పాటు 11 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు , అసిస్టెంట్ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు , ఎన్నికల రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ) రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను రూపొందిస్తున్నారు” అని జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు.

డిప్యూటేషన్ సిబ్బందికి ధన్యవాదాలు
ఈ భారీ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న క్షేత్రస్థాయి సిబ్బంది అంతా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని సీఈసీ గుర్తుచేశారు. ఒక పవిత్రమైన ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడానికి, ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన ఓటర్ల జాబితాల్లో ఒక దానిని తయారుచేయడానికి వీరందరూ ఎన్నికల సంఘానికి డిప్యూటేషన్‌పై వచ్చి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవస్థతో కలిసి పనిచేస్తున్న దేశంలోని ప్రముఖ న్యాయవాదులందరికీ, అలాగే ఎండనక, వాననక శ్రమిస్తున్న 11 లక్షల బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల బూత్ స్థాయి ఏజెంట్లకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు (వందనాలు) తెలియజేశారు. విమర్శలను పక్కనబెట్టి పారదర్శకమైన ఓటింగ్ వ్యవస్థ కోసం ఈ సవరణలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.