అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
భర్తే చంపేశాడంటూ తల్లి ప్రమీల ఫిర్యాదు
కాకతీయ, నెల్లికుదురు : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో జెల్ల కృష్ణవేణి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణవేణి శుక్రవారం తన ఇంటిలో ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి తల్లి ప్రమీల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. 14 ఏళ్ల క్రితం కృష్ణవేణికి పరశురాములతో వివాహం జరిగిందని, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భర్త పరశురాములే తన కూతురిని చంపి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరి వేసినట్లు అనుమానంగా ఉందని ఆమె ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు వెల్లడించారు.

