ఘనంగా వాసవీ మాత పారాయణం
వాసవి గార్డెన్స్‌లో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన
కాకతీయ, చేర్యాల : ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత, మణిద్వీప వర్ణన పారాయణం స్థానిక వాసవి గార్డెన్స్‌లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి పలు రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీశ్రీశ్రీ పూజ్య శ్రీ లక్ష్మి నారాయణ గురు భవాని హాజరై పారాయణం విశిష్టతను భక్తులకు వివరించారు. వాసవీ మాత ఆశీస్సులతో సమాజంలో శాంతి, ఐకమత్యం నెలకొనాలని భక్తులు ప్రార్థించారు. అనంతరం అమ్మవారికి మంగళహారతి ఇచ్చి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కుల పెద్దలు, యువత, భక్తులు పాల్గొన్నారు.


