epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

2027 నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ పూర్తి

2027 నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ పూర్తి
కుంగిపోయిన బ్యారేజీపై లోతైన అధ్యయనం
ప్రపంచ స్థాయి నిపుణులతో రీడిజైన్ ప్రక్రియ
రాజకీయ దురుద్దేశం లేదు.. ప్రాజెక్టును వినియోగంలోకి తేవడమే లక్ష్యం
2027 ఎండాకాలం నాటికి పూర్తి లక్ష్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మేడిగడ్డలో సాంకేతిక పరీక్షల పరిశీలన

కాకతీయ, మల్హర్/మేడిగడ్డ : మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను 2027 నాటికి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద జరుగుతున్న సాంకేతిక పరీక్షల పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో చేపట్టిందని, అప్పటికే దాదాపు రూ.11 వేల కోట్ల పనులు పూర్తై 30 శాతం పురోగతి సాధించిందని మంత్రి గుర్తు చేశారు. అయితే 2014 తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టు రూపురేఖలను మార్చి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. 16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు తప్పుడు నిర్ణయాలు, లోపభూయిష్ట నిర్మాణం కారణంగా సమస్యల్లో చిక్కుకుందని విమర్శించారు.

కుంగిపోయిన బ్యారేజీపై లోతైన అధ్యయనం

దాదాపు రూ.1.45 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణాలను గుర్తించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూడడం లేదని, సాంకేతికంగా పటిష్టమైన పరీక్షల ఆధారంగా పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు పనులు కూడా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మేడిగడ్డ పునరుద్ధరణ కోసం ప్రపంచ ప్రఖ్యాత “ఆఫ్రిన్” కన్సల్టెన్సీ సంస్థను నియమించి, ఐఐటీ బాంబే నిపుణులతో కలిసి రీడిజైన్ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. జూన్ చివరి నాటికి లేదా జూలై తొలి వారంలో అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తవుతాయని, ఆ నివేదికల ఆధారంగా తుది డిజైన్ రూపొందించనున్నట్లు తెలిపారు. అనంతరం సీడబ్ల్యూసీ, ఎన్‌డీఎస్‌ఏ అనుమతులు తీసుకుని వర్షాకాలం అనంతరం నవంబర్-డిసెంబర్ నెలల్లో పునరుద్ధరణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.

2027 ఎండాకాలం నాటికి పూర్తి లక్ష్యం

ఒకే వర్కింగ్ సీజన్‌లో ప్రధాన పనులు పూర్తి చేసి 2027 ఎండాకాలం నాటికి మేడిగడ్డ బ్యారేజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. భారత సైన్యంలో అత్యంత అనుభవం కలిగిన కల్నల్ పరిషిత్ మెహ్రా ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ పరీక్షలు నిర్వహిస్తోందని తెలిపారు. దేశ, విదేశాల నిపుణుల సూచనలతో సాంకేతిక పరిశీలనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఈ శ్రీనివాస్ గుప్తా, ఆర్డీఓ రవీందర్, ఎస్ఈ దస్తగిరి, ఈఈ రమేష్, కన్సల్టెంట్ ఈఈ యాదగిరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.