epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మాతృత్వానికి మాయని మచ్చ

మాతృత్వానికి మాయని మచ్చ
ఇద్దరు కొడుకుల‌కు ఎలుకల మందు పెట్టి కడతేర్చిన తల్లి!
ఖ‌మ్మం జిల్లా మునిగిన గుర్రాలపాడులో దారుణ ఘ‌ట‌న‌
సొంతూరికి వెళ్లిపోదామ‌న్నందుకు భార్య ఘాతుకం
నిద్రలోనే కన్నుమూసిన పెద్ద కుమారుడు వేదక్
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కుమారుడు తనీష్ మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఖమ్మం త్రీటౌన్ పోలీసులు

కాక‌తీయ‌, ఖ‌మ్మం బ్యూరో : పిల్లల ఆలనా పాలనా చూస్తూ, తన కడుపు మార్చుకొని బిడ్డల కడుపు నింపాల్సిన ఓ తల్లి.. కన్నప్రేమను మర్చిపోయి కసాయిగా మారింది. క్షణికావేశంలో ఆమె చేసిన ఘాతుకం ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న వివాదం చివరకు ఇద్దరు కొడుకులను పొట్టనబెట్టుకునేలా చేసింది. ఫాదర్స్ డే నాడే ఇద్దరు పిల్లలను కోల్పోయి ఆ తండ్రి పుట్టెడు శోకంలో మునిగిపోగా, యావత్ సభ్య సమాజం దిగ్బ్రాంతికి గుర‌వుతోంది.

ఖమ్మం నుంచి సొంత ఊరికి వెళ్లే విషయంలో గొడవ
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏడో డివిజన్ గుర్రాలపాడు గ్రామానికి చెందిన బొబ్బల లింగరాజు, స్వాతి దంపతులు గత కొన్ని నెలలుగా కుటుంబ అవసరాల నిమిత్తం ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. లింగరాజు అక్కడే స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ షాపులో వర్కర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం సదరు సెల్ పాయింట్ యజమాని.. షాప్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, తాను నడపలేనని చెబుతూ ప్రత్యామ్నాయ ఉద్యోగం చూసుకోవాలని లింగరాజుకు చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు గడవడం కష్టంగా మారడంతో.. లింగరాజు తన సొంత ఊరైన గుర్రాలపాడు వెళ్లి అక్కడ ఏదైనా పని చేసుకుని బ‌తుకుదామని భార్యకు నచ్చజెప్పాడు. కానీ భార్య స్వాతి మాత్రం అందుకు నిరాకరించింది. మ‌నం ఖమ్మంలోనే ఉండాలని పట్టుబట్టింది. ఈ విషయమై గత రెండు రోజులుగా భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరుగుతోంది.

బిస్కెట్లలో ఎలకల మందు కలిపి దారుణం
భర్త తన మాట వినడం లేదనే కోపంతో స్వాతి శ‌నివారం సాయంత్రం దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లలో ఎలకల మందు కలిపి తినిపించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు భర్తకు ఫోన్ చేసి.. పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని, త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. కంగారుగా ఇంటికి వచ్చిన లింగరాజు.. స్థానిక మెడికల్ షాప్‌లో సిరప్ తీసుకువచ్చి పిల్లలకు తాపించి పడుకోబెట్టాడు. అయితే విషప్రభావం ఎక్కువ కావడంతో పెద్ద కుమారుడు వేదక్ కుమార్ నిద్రలోనే కన్నుమూశాడు. అటు చిన్న కుమారుడికి తీవ్రంగా వాంతులు కావడంతో వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో చిన్న కుమారుడు తనీష్ కూడా మరణించాడు. ఫాదర్స్ డే నాడే ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గుర్రాలపాడు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న ఖమ్మం మూడో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.