చేర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం
యువకుడు అక్కడికక్కడే మృతి
కాకతీయ, చేర్యాల : చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామానికి చెందిన చిగుళ్ల వంశీ (25) అనే యువకుడు ఏపీ 10 బీఏ 5692 గల ద్విచక్రవాహనంపై గురువారం వ్యక్తిగత పనుల కోసం చేర్యాల పట్టణానికి వచ్చి తిరిగి ముస్త్యాలకు వెళుతుండగా మార్గమధ్యలో చేర్యాల కోర్టు ఎదురుగా టీజీ 24 సీ 0018 గల కారు అతివేగంగా వెనుక నుండి బలంగా ఢీ కొట్టి దూసుకెల్లడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి శ్రీనివాస్ కొన్నాళ్ల క్రితం అప్పుల బాధతో మృతి చెందాడు. మృతునికి తల్లి, భార్య ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేర్యాల ఎస్సై గూడ అపూర్వ రెడ్డి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.


