epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘విజయా డెయిరీ’ని మూసేస్తే స‌హించం

విజయా డెయిరీ’ని మూసేస్తే స‌హించం
ప్రభుత్వ సంస్థ నిర్వీర్యానికి మంత్రుల కుట్ర!
ప్రైవేటు డైరీల కోస‌మే మూసివేత ప్ర‌క్రియ తెర‌పైకి
అధికారులతో కుమ్మక్కై వరంగల్ నుంచి పాల సరఫరాకు యత్నం
డెయిరీని అంగుళం కదిపినా ఊరుకోం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి హెచ్చరిక

కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లా పాడి రైతులకు ఆశాదీపంగా నిలుస్తూ, దశాబ్దాలుగా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ప్రతిష్టాత్మక ‘విజయా డెయిరీ’ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు పాలకుల స్థాయిలో భారీ కుట్ర జరుగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డెయిరీని ఇక్కడి నుంచి మూసివేసి, వరంగల్ నుంచి పాల సరఫరా చేసేందుకు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్న రైతుల ఆవేదనతో బీజేపీ శ్రేణులు గురువారం అప్రమత్తమయ్యాయి. నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న విజయా డెయిరీ ప్రాంగణాన్ని స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. డెయిరీని ఇక్కడి నుంచి తరలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హస్తం పాలకులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

సొంత డెయిరీ కోసం ప్రభుత్వ సంస్థ బలి!
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులపై నిప్పులు చెరిగారు. తామేదో జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని, గొప్ప ప్రజాపాలన అందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న మంత్రులు.. తమ కళ్లెదుటే ప్రభుత్వ డెయిరీని మూసివేసే కుట్రలు జరుగుతుంటే ఎందుకు నిద్రపోతున్నారని ఘాటుగా ప్రశ్నించారు. జిల్లాకు చెందిన ఒక మంత్రి తన సొంత డెయిరీని స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని, ప్రభుత్వ డెయిరీ ఇక్కడే కొనసాగితే తన ప్రైవేట్ సంస్థకు రైతుల నుంచి పాల సేకరణ జరగదనే దురుద్దేశంతోనే ఈ మూసివేత వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. పాలకుల కళ్లల్లో ఆనందం చూడటం కోసం కొందరు అధికారులు సైతం వారితో కుమ్మక్కై, ఉద్దేశపూర్వకంగానే డెయిరీలో పాల సేకరణను తగ్గించి, చివరకు దీనిని నష్టాల్లో ఉన్న సంస్థ (సిక్ యూనిట్)గా ప్రకటించేందుకు సర్వశక్తులొడ్డుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.

డెయిరీ భూములపై రియల్ ఎస్టేట్ కన్ను
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములపై అధికార పార్టీ నేతలు రాబందుల్లా కన్నేశారని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. జిల్లాకే చెందిన భూముల మంత్రి కనుసన్నల్లోనే ఈ కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపించారు. ఎక్కడ విలువైన ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని కంప్యూటర్లలో మాయం చేసి, రాత్రికి రాత్రే తమ బినామీల పేర్ల మీదకు మార్చుకుంటున్నారని మండిపడ్డారు. వెలుగుమట్ల ప్రాంతంలోని భూములతో పాటు, సత్తుపల్లిలోని ఫుడ్ పార్కులో ఉన్న 72 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఎలాంటి జీఓలు, కనీస ప్రణాళికలు లేకుండానే ప్రైవేట్ కంపెనీలకు అడ్డగోలుగా కట్టబెట్టిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు అత్యంత విలువైన విజయా డెయిరీ భూమిని సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకోవాలనో లేదా తమ బినామీలకు ధారాదత్తం చేయాలనో అధికార పక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోందని వారు అనుమానం వ్యక్తం చేశారు. వేలాది మంది పాడి రైతులు, కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ ఆస్తులను కాజేయాలని చూసే మంత్రులు, అధికారులకు ‘ఖబడ్దార్’ అని హెచ్చరిస్తున్నామ‌ని అన్నారు. విజయా డెయిరీ ప్రస్తుతమున్న ఇందిరానగర్ అడ్రస్‌లోనే కొనసాగాలి. డెయిరీ మూసివేత ఆలోచనలను తక్షణమే విడనాడి, ఇక్కడే పాల సేకరణను, అమ్మకాలను పెంచేలా అభివృద్ధి చర్యలు చేపట్టాలి. కుట్రలను ఆపకపోతే డెయిరీని ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలనివ్వబోం. ఒకవేళ అధికార అహంకారంతో మొండిగా ముందుకు వెళ్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం చేపడతామని స్ప‌ష్టం చేశారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరు రామలింగేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, ప్రధాన కార్యదర్శులు గుత్తా వెంకటేశ్వరరావు, నాయుడు రాఘవరావు, ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్ రాథోడ్, జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్, నకిరేకంటి వీరభద్రం, ఎల్లారావు గౌడ్, వీరం రాజు, అర్బన్ అధ్యక్షుడు వాకధాని రామకృష్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు మంద సరస్వతి, శాసనాల సాయిరాం, రజినీ రెడ్డి, శ్రీరామనేని మనీ, తాజ్నూత్ భద్రం, దీకొండ శ్యామ్, రీగన్ ప్రతాప్, రాము తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.